మంత్రాలయం ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి
ABN, Publish Date - Jun 05 , 2024 | 12:24 AM
మంత్రాలయం నియో జకవర్గం నుంచి వరుసగా నాల్గవసారి వై.బాల నాగిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
మంత్రాలయం, జూన్ 4: మంత్రాలయం నియో జకవర్గం నుంచి వరుసగా నాల్గవసారి వై.బాల నాగిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత మూడుసార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి 2024 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డిపై 12,882 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బాలనాగిరెడ్డి మంత్రాలయం గడ్డపై మొదటిసారి తెలుగుదేశం జెండా ఎగురవేసి.. మూడుసార్లు వైసీపీ నుంచి గెలుపొందారు. ఈయన వరుస విజయాలతో నియోజకవర్గంలో రాంపురంరెడ్డి సోదరుల అభిమానులు, వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మొత్తం 17 రౌండ్లలో నాలుగు రౌండ్లు మినహా వైసీపీకి ఆధిక్యత కొనసాగింది. పోస్టల్‌బ్యాలెట్‌లో 328 ఓట్లు టీడీపీకి రాగా, 251 వైసీపీకి వచ్చాయి. ఇందులో 77 ఓట్లు టీడీపీకి మెజారిటీ వచ్చింది. మంత్రాలయం, కోసిగి, కౌతాళం మూడు మండలాలు వైసీపీకి రాగా, పెద్దకడుబూరు మండలం టీడీపీకి 151 ఓట్లు వచ్చాయి. దీంతో 12,282 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి ఎమ్మెల్యేగా నాల్గవసారి సాధించారు. బాలనాగిరెడ్డి తరుపున ఆయన అన్న కొడుకు ప్రదీప్ రెడ్డి ఆర్వో చల్లా విశ్వనాథ్, అసిస్టెంట్ ఆర్వో శ్రీధర్‌మూర్తి, డీటీ గురు రాజారావు చేతుల మీదుగా డిక్లరేషన్ ఫారమ్ అందుకున్నారు.
Updated Date - Jun 05 , 2024 | 12:24 AM