ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Assembly: ఫిబ్రవరి 8 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో నిర్ణయం

ABN, Publish Date - Feb 05 , 2024 | 12:25 PM

Andhrapradesh: ఈనెల 8 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. నేడు (సోమవారం) అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశమైంది. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. బుధవారం (ఫిబ్రవరి 7) అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

అమరావతి, ఫిబ్రవరి 5: ఈనెల 8 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. నేడు (సోమవారం) అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం (AP Assembly Speaker Tammineni Seetharam) నేతృత్వంలో బీఏసీ (BAC Meeting) సమావేశమైంది. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. బుధవారం (ఫిబ్రవరి 7) అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి (Minister Buggana Rajendranathh Reddy) 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో గతేడాది మాదిరిగానే ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీఏసీ సమావేశం అనంతరం స్పీకర్‌‌‌తో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) సమావేశమయ్యారు.

కాగా.. బీఏసీ సమావేశాన్ని టీడీపీ (TDP) బాయ్‌కాట్ చేసింది. అసెంబ్లీ బీఏసీ సమావేశాన్ని బహిష్కరించాలని టీడీఎల్పీలో నిర్ణయం తీసుకున్నారు. అయితే టీడీపీ సభ్యులు లేకుండా బీఏసీ సమావేశం జరిగింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 05 , 2024 | 12:27 PM

Advertising
Advertising