ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో మరో రచ్చ

ABN, Publish Date - Sep 09 , 2024 | 03:32 AM

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఫ్యామిలీ డ్రామా మరోసారి రచ్చయింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం అక్కవరం సమీపంలోని దువ్వాడ నివాసంలో ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వల మాధురి శనివారం ఉదయం కనిపించడం ఉద్రిక్తతకు దారి తీసింది.

శ్రీనివాస్‌ నివాసంలోకి ఎంట్రీ ఇచ్చిన మాధురి

లోపలికెళ్లేందుకు వాణి, ఆమె కుమార్తెల యత్నం

కోర్టు ఆర్డర్‌ కావాలంటూ అడ్డుకున్న పోలీసులు

ఇల్లు తన పేరున రిజిస్ట్రేషన్‌ అయిందన్న మాధురి

అప్పులు తీర్చేందుకే మాధురికి

ఇల్లు అమ్మేశా: దువ్వాడ శ్రీనివాస్‌

టెక్కలి, సెప్టెంబరు 8: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఫ్యామిలీ డ్రామా మరోసారి రచ్చయింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం అక్కవరం సమీపంలోని దువ్వాడ నివాసంలో ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వల మాధురి శనివారం ఉదయం కనిపించడం ఉద్రిక్తతకు దారి తీసింది. తమకు కోర్టు ఆర్డర్‌ ఉందంటూ వాణి, ఆమె కుమార్తెలు కూడా ఆ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ద్వారా ఆర్డర్‌ వస్తే తప్ప ఇంటి లోపలకు పంపలేమని స్పష్టంచేశారు. రాత్రి వరకూ ఈ హైడ్రామా కొనసాగింది. వాణి నిచ్చెన తెచ్చి పైకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. దీంతో అక్కడున్న సీసీ కెమెరాలను వాణి ధ్వంసం చేశారు. పై అంతస్తులో ఉన్న మాధురి ఈ తతంగాన్ని వీడియో తీశారు. ఈ క్రమంలో మాధురి, వాణి మధ్య మాటల యుద్ధం సాగింది. మాధురిని ఆ ఇంటి నుంచి బయటకు పంపాలని వాణి, ఆమె కుమార్తెలు డిమాండ్‌ చేశారు. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ కాశీబుగ్గ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆ ఇంటిని మాధురి పేరున రిజిస్టర్‌ చేశారు. దీంతో ఈ ఇల్లు తనదేనని, లోపలకు ఎవరు వచ్చినా ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ వ్యవహారంలో నెల రోజులుగా న్యాయపోరాట దీక్ష చేస్తున్న వాణి శనివారం అర్ధరాత్రి అక్కడి నుంచి.. సొంతింటికి వెళ్లిపోయారు.

ఇదిలాఉండగా హైకోర్టు న్యాయవాది ఆజాద్‌తో కలిసి మాధురి దువ్వాడ నివాసంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నేరుగా శ్రీనివా్‌సతో ఫోన్‌ లైవ్‌లో మాట్లాడించారు. దువ్వాడ మాట్లాడుతూ ‘ఈ ఇల్లు నా స్వార్జితం. నా రాజకీయ ఖర్చులకు, ఇంటి నిర్మాణానికి, ఇతరత్రా ఖర్చులకు మాధురి వద్ద నాలుగు విడతలుగా రూ.2 కోట్లు తీసుకున్నాను. ఇటీవల మరో రూ.50లక్షలు తీసుకున్నాను. చింతాడ పార్వతీశానికి రూ.60లక్షలు బాకీ ఉన్నాను. అందుకే ఈ ఇల్లు మాధురికి అమ్మేసి ఆమె పేరున రిజిస్ట్రేషన్‌ చేశాను’ అని వెల్లడించారు. అక్కడే పార్టీ కార్యాలయం, పైన ఉండేందుకు ఓ గది ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు. వాణికి ఈ ఇల్లు ఇస్తే తాను చెట్టుకింద ఉండాలా అని ఆయన ప్రశ్నించారు అందుకే మాధురికి బకాయిలు తీర్చేందుకు ఇల్లు ఆమె పేరున రిజిస్ట్రేషన్‌ చేశానని చెప్పారు. తన వ్యాపారాలన్నీ ప్రస్తుతం ఆగిపోయాయని, తన కారణంగా రోడ్డున పడిన మాధురికి అప్పు తీర్చేందుకు ఈ ఆస్తి రాసిచ్చినట్లు దువ్వాడ వెల్లడించారు. మాధురి మాట్లాడుతూ ‘ఈ ప్రాపర్టీ నాది. నా అనుమతి లేకుండా ఎవరూ లోపలకు రాకూడదు. ఈ నివాసానికి రెండేళ్ల పాటు రాని వాణి ఇప్పుడెందుకు రావాలి. రాజకీయంగా శ్రీనివా్‌సను పతనం చేయాలన్నదే వాణి కుతంత్రం’ అని ఆరోపించారు. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్‌, మాధురి ఫోన్‌కాల్‌ ఆడియో బహిర్గతమైన విషయంపై స్పందిస్తూ అది కల్పితమన్నారు. తన ఇంటిని దువ్వాడ కార్యాలయానికి అద్దెకు ఇస్తానని వివరించారు.

Updated Date - Sep 09 , 2024 | 07:43 AM

Advertising
Advertising