ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

ABN, Publish Date - Jul 17 , 2024 | 05:00 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఆణివార ఆస్థానం శాస్ర్తోక్తంగా జరిగింది. చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్యామలరావు, ఇతర ఉన్నతాధికారులు వెంట రాగా పెద్దజీయర్‌ స్వామి వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్ర్తాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా విచ్చేశారు.

తిరుమల, జూలై16 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఆణివార ఆస్థానం శాస్ర్తోక్తంగా జరిగింది. చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్యామలరావు, ఇతర ఉన్నతాధికారులు వెంట రాగా పెద్దజీయర్‌ స్వామి వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్ర్తాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా విచ్చేశారు. నాలుగు పట్టువస్ర్తాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్ర్తాలలో ఒకటి మలయప్పస్వామికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు. తర్వాత పెద్ద, చిన్నజీయర్‌ స్వాములకు, ఈవోకు టీటీడీ తరపున ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి అర్చకులు తగిలించారు. ఈ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల వద్ద ఉంచడంతో ఆణివార ఆస్థానం ముగిసింది. సాయంత్రం ఉత్సవ మూర్తులు పుష్పపల్లకీలో కొలువుదీరి మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

Updated Date - Jul 17 , 2024 | 08:50 AM

Advertising
Advertising
<