ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

crime అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

ABN, Publish Date - Sep 10 , 2024 | 12:08 AM

మండలంలోని పూలకుంట గ్రామంలో సోమవారం ఉదయం నందిని(22)అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పూలకుంటకు చెందిన నగే్‌షకు గోనబావికి చెందిన రామాంజనేయులు, నాగమ్మల కూమార్తె నందినితో ఆరునెలల క్రితం వివాహం జరిగింది.

- భర్త, అతడి కుటుంబసభ్యులే చంపారని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ

- రాయదుర్గం ప్రభుత్వాస్పత్రి వద్ద బంధువులతో కలిసి ఆందోళన

గుమ్మఘట్ట, సెప్టెంబరు 9 : మండలంలోని పూలకుంట గ్రామంలో సోమవారం ఉదయం నందిని(22)అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పూలకుంటకు చెందిన నగే్‌షకు గోనబావికి చెందిన రామాంజనేయులు, నాగమ్మల కూమార్తె నందినితో ఆరునెలల క్రితం వివాహం జరిగింది.


ఐదునెలల పాటు వీరి జీవితం సజావుగానే సాగింది. అయితే నెలరోజులుగా నగే్‌షతో పాటు అతడి కుటుంబసభ్యులు తమ కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్నట్లు నందిని తండ్రి ఆరోపించాడు. సోమవారం ఉదయం నందిని బాత్రూంలో జారి పడిందని , రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి రమ్మని తెలిపారని, తీరా ఆస్పత్రికి వచ్చాక ఆమె మృతదేహాన్ని చూపించారంటూ విలపించాడు. ఈ క్రమంలో ఆమె కుటుంబసభ్యులు భారీగా ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. నందినిని భర్త , ఇతర కుటుంబసభ్యులు వేధించి చంపారంటూ ఆగ్రహించారు. దీంతో గంటపాటు ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న రాయదుర్గం సీఐ వెంకటరమణ పోలీసు సిబ్బందితో వచ్చి ఆందోళనకారులను సర్ధిచెప్పారు. తర్వాత మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గుమ్మఘట్ట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Sep 10 , 2024 | 12:08 AM

Advertising
Advertising