ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఏం కష్టమొచ్చింది మామా..!

ABN, Publish Date - May 12 , 2024 | 12:01 AM

అనంతపురంలో మద్యం దుకాణం వద్ద బారులుతీరిన జనం, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వద్ద మందుబాబులు పోలింగ్‌ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను శనివారం సాయంత్రం 6 గంటలకు మూసేశారు

rush near wine shopos

అనంతపురంలో మద్యం దుకాణం వద్ద బారులుతీరిన జనం, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వద్ద మందుబాబులు పోలింగ్‌ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను శనివారం సాయంత్రం 6 గంటలకు మూసేశారు. ఎక్సైజ్‌ అధికారులు సీల్‌ వేశారు. 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తెరవరు. పోలింగ్‌ ముగిశాక, జిల్లా ఎన్నికల అధికారి అనుమతితో తెరుస్తామని, ఆ రోజు.. ఆ సమయానికి ఎక్కడైనా ఘర్షణ వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉంటే.. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పూర్తిగా బంద్‌ చేస్తామని తెలిపారు. ఇదే జరిగితే 14వ తేదీన మద్యం దుకాణాలను తెరుస్తారు. బంద్‌ నేపథ్యంలో అనంతపురం నగరంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మద్యం కోసం పలువురు ఎగబడ్డారు. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటలకే దుకాణాలను మూసేశారు. సిబ్బందిలో కొందరు వైసీపీ నాయకులకు పెద్ద మొత్తంలో ఒకేసారి మద్యం ఇచ్చేశారని తెలిసింది. అందుకే సాధారణ మద్యం ప్రియులకు సరుకు దొరకలేదని అంటున్నారు. కొన్నిచోట్ల నచ్చిన బ్రాండ్లు లేకపోయినా ఏదో ఒకటి ఇవ్వండి అని తీసుకెళ్లారు. ప్రభుత్వ దుకాణాల్లో మద్యం స్టాక్‌ లేకపోవడంతో కొందరు బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు వెళ్లారు. అద నంగా డబ్బులు వెచ్చించి కొనుగోలు చేశారు.

- అనంతపురం అర్బన

Updated Date - May 12 , 2024 | 12:01 AM

Advertising
Advertising