ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MSRAJU : ప్రతి నాయకుడు, కార్యకర్తకు న్యాయం చేస్తాం

ABN, Publish Date - Jun 18 , 2024 | 12:09 AM

ఎన్నికల్లో టీడీపీ విజయానికి కష్టపడిన పార్టీకి చెందిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నారు. తమ అధికారాలను గ్రా మస్థాయి నాయకులకు వికేంద్రీకరిస్తూ కొత్త అధ్యయనానికి నాంది పలుకుతు న్నా మని పేర్కొన్నారు. వారు సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహ ఆవరణంలో నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.

MS Raju, Gundumala, performing milk anointing for Chandrababu's film

గ్రామస్థాయికి అధికార వికేంద్రీకరణ: ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు

మడకశిర టౌన, జూన 17: ఎన్నికల్లో టీడీపీ విజయానికి కష్టపడిన పార్టీకి చెందిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నారు. తమ అధికారాలను గ్రా మస్థాయి నాయకులకు వికేంద్రీకరిస్తూ కొత్త అధ్యయనానికి నాంది పలుకుతు న్నా మని పేర్కొన్నారు. వారు సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహ ఆవరణంలో నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామస్థాయిలో అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేస్తామని, అందు లో 10 నుంచి 15 మంది అవగాహన కలిగిన నాయకులు, కార్యకర్తలకు చోటు కల్పించి, తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు.


అభివృద్ధి కార్యక్రమా ల ఎంపికలో వారు కీలక భూమిక పోషిస్తారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, ప్రతి చిన్న ఉద్యోగానికీ డ బ్బుకు ముడిపెట్టారని విమర్శించారు. తమ ప్రభుత్వంలో అలాంటి వాటికి ఆస్కా రం ఉండదన్నారు. అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించమన్నారు. కిందిస్థాయి నాయకత్వం ఎంత బలపడితే టీడీపీ అంత బలంగా ఉంటుందని తెలిపారు. ని యోజకవర్గంలో కక్ష సాధింపులు వద్దని, అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దామన్నారు.


దే వాలయం లాంటి అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని సైతం అవహేళ న చేశారని, ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందో చూడాలన్నారు. వంశీ విదేశాలకు పారిపోయారని, కొడాలి నాని, అనిల్‌కుమార్‌యాదవ్‌, అంబటి రాంబాబు లాంటి వారి భవిష్యత్తు ఏమిటో తేలిపోయిందన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజలకు జవాబుదారీగా పనిచేసినప్పుడే గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీలో అనేక అవకాశా లు పొంది పార్టీకి ద్రోహం చేసిన వారిని ఉపేక్షించమన్నారు. అనంతరం అన్న క్యాంటినను పరిశీలించారు. చంద్రబాబు చిత్రపటానికి ఎంఎస్‌రాజు, గుండుమల తిప్పేస్వామి క్షీరాభిషేకం చేశారు. నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు అంకిత భావంతో పనిచేస్తామన్నారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శి రాధాకృష్ణ, మున్సిపల్‌ మాజీ చైర్మన నరసింహరాజు, నాయకులు మనోహర్‌, భక్తర్‌, తిమ్మరా జు, ఆర్‌ జయకుమార్‌, మంజునాథ్‌, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 18 , 2024 | 12:09 AM

Advertising
Advertising