ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చీనీరైతులను ఆదుకుంటాం

ABN, Publish Date - Apr 16 , 2024 | 11:59 PM

తాడిమర్రి, ఏప్రిల్‌ 16: కష్టాల్లో ఉన్న చీనీ రైతులను ఆదుకుంటామని నియోజకవర్గ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. మండలంలోని రామాపురం, కునుకుంట్ల, మద్దలచెరువు, మేడిమాకుల పల్లి, ఆత్మకూరు , శివంపల్లి, అగ్రహారం, మర్రిమాకులపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తాడిమర్రి, ఏప్రిల్‌ 16: కష్టాల్లో ఉన్న చీనీ రైతులను ఆదుకుంటామని నియోజకవర్గ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. మండలంలోని రామాపురం, కునుకుంట్ల, మద్దలచెరువు, మేడిమాకుల పల్లి, ఆత్మకూరు , శివంపల్లి, అగ్రహారం, మర్రిమాకులపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కునుకుంట్ల గ్రామం వద్ద చీనీరైతుల వద్దకు వెళ్లి వారి ఇబ్బందుల గురించి ఆరా తీశారు. పంటలకు సరిపడా నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, భూగర్భజలాలుపూర్తిగా అడుగుంటడంతో ఈ పరిస్థితి తలెత్తిందని కొందరు రైతులు వాపోయారు. దీనికి తోడు నాణ్యమైన పురుగుల మందులు లభించక చీనీచెట్లకు ఎక్కువ సార్లు మందులు కొట్టి నష్టాల పాలవుతున్నామన్నారు. ఇందుకు స్పందించిన సత్యకుమార్‌ కూటమి అధికారంలోకి రాగానే చీనీపంటకు గిట్టుబాటు ధర కలిస్తామన్నారు. అలాగే నాణ్యమైన మందులను పంపిణీ చేసేలా చర్యలుచేపడుతున్నామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఇంటింటా తిరిగి కూటమి అధికారంలోకి చేపట్టే అభివృద్ధి పనులను వివరించారు. కూటమి విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట్ల

విజయ్‌కుమార్‌, మండల కన్వీనర్‌ కూచిరామ్మోహన, నాయకులు వెంకటేశ, జనార్దన పతకమూరి, ఎల్‌ నరేంద్రచౌదరి, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ గోపాల్‌రెడ్డి, రఘురాంచౌదరి,హర్ష, శ్రీనివాసులు, ఎల్లప్ప, పక్కీర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 12:00 AM

Advertising
Advertising