ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ways to solve rural problems పల్లె సమస్యల పరిష్కారానికి బాటలు

ABN, Publish Date - Aug 24 , 2024 | 01:15 AM

వైసీపీ హయాంలో గ్రామపంచాయతీల అభివృద్ధి శూన్యమని, కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అభివృద్ధికి బాటలు వేస్తున్నామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. గ్రామదట్లలో శుక్రవారం సర్పంచ రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.

రాయదుర్గం రూరల్‌, ఆగస్టు 23: వైసీపీ హయాంలో గ్రామపంచాయతీల అభివృద్ధి శూన్యమని, కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అభివృద్ధికి బాటలు వేస్తున్నామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. గ్రామదట్లలో శుక్రవారం సర్పంచ రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.


జగన ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. ఐదేళ్లలో రూ. 13 వేల కోట్ల నిధులను దారి మళ్లించారన్నారు. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడునెలల కాలంలోనే 15వ ఆర్థిక సంఘం నిధులను రూ. 990 కోటు,్ల జలజీవన మిషన కింద రూ. 550 కోట్లను పంచాయతీల ఖాతాల్లో జమ చేశామన్నారు. మొత్తం రూ.1540 కోట్లను గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేశారని తెలిపారు. ఇందుకు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవనకళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత గ్రామస్థులు గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు. ముఖ్యంగా అండర్‌ డ్రైనేజీల పనులను చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. అదే విధంగా ఎస్సీకాలనీవాసులకు దాదాపు 30 కుటుంబాలకు ఇళ్లస్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. అదే విధంగా గ్రామంలో సీసీరోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. మహిళా సంఘాలకు గ్రామసమైఖ్య భవనం ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఇనచార్జి ఎంపీడీఓ రంగనాయకులు హౌసింగ్‌ డీఈ రంగస్వామి, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శ్రీనివాసులు, ఇనచార్జ్‌ సీనియర్‌ నాయకులు భీమసేనరావు, జింకుల గోవిందరెడ్డి, సోమశేఖర్‌, వీరే ష్‌, నాగరాజు, బ్రహ్మానందరెడ్డి, మాజీ సర్పంచ సుంకన్న, గంగప్ప, నీల తదితరులు పాల్గొన్నారు. వేపరాలలో జరిగిన కార్యక్రమంలో డీఎల్‌డీఓ శంకర్‌, టీడీపీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Aug 24 , 2024 | 01:15 AM

Advertising
Advertising
<