ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ధర్మవరాన్ని చేనేత హబ్‌గా మారుస్తా

ABN, Publish Date - Apr 19 , 2024 | 12:33 AM

ధర్మవరం, ఏప్రిల్‌ 18: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధర్మవరం పట్టణాన్ని చేనేత హబ్‌గా మా ర్చుతానని కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు.

ధర్మవరం, ఏప్రిల్‌ 18: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధర్మవరం పట్టణాన్ని చేనేత హబ్‌గా మా ర్చుతానని కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని పుట్లమ్మ ఆల యం వద్ద గురువారం ఆయన చేనేతలతో సమావేశం ఏర్పాటు చేసి మా ట్లాడారు. పుట్లమ్మ సాక్షిగా చెబుతున్నానని, తాను అవినీతిమరకకు ఆమడదూరంగా ఉంటానని, ధర్మవరాన్ని చేనేత హబ్‌గా మారుస్తానని తెలిపారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి స్వలాభం చూసు కున్నారే కానీ.. ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. నియోజకవర్గాన్ని పూర్తీగా నాశనం చేశారన్నారు. చేనేత పరిశ్రమను అబివృద్ధి చేయాల్సింది పోయి.. చేనేతలకు ఇబ్బందులు కల్పించడం బాధాకరమన్నారు. వైఎస్‌ జగన సీఎం కాకమునుపు ధర్మవరానికి వచ్చి చేనేతల కోసం దీక్షలు కూడా చేశారని, అయితే సీఎం అయిన తరువాత చేనేతల సంక్షేమం కోసం ఏమి చేశారని ప్రశ్నించారు. ఎన్నికల్లో చేనేతలందరూ వైసీపీని ఇంటికి పంపాలని కోరారు. తొలుత వైసీపీ చేనేత విభాగంరాష్ట్ర ప్రధానకార్యదర్శి, చేనేత వ్యాపారి గిర్రాజు నగేశతోపాటు పలువురు సత్యకుమార్‌ సమక్షంలో బీజేపీలోకి చేరారు. కార్యక్రమంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కల్చరల్‌ అసోసియేషన రాష్ట్ర కన్వీనర్‌ ఎల్‌ నరేంద్రచౌదరి, టీడీపీ

రాష్ట్ర కార్యదర్శులు గోనుగుంట్ల విజయ్‌ కుమార్‌, కమతం కాటమయ్య, బీజేపీ నాయకులు జింకా చంద్ర, గుండా పుల్లయ్య, సాకే ఓబు లేశు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:33 AM

Advertising
Advertising