ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కూటమి విజయంలో సైనికులే కీలకం

ABN, Publish Date - Jun 07 , 2024 | 12:05 AM

జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయంలో జనసైనికులు కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో పెద్దలను ఒప్పించడం.. రాష్ట్రస్థాయిలో నేతలతో పొత్తుల కుదర్చ డంలో జనసేన అధినేత పవనకల్యాన చేసిన కృషి మరువలేనిది.

కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో టీసీ వరుణ్‌ ప్రచారం

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జూన 6: జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయంలో జనసైనికులు కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో పెద్దలను ఒప్పించడం.. రాష్ట్రస్థాయిలో నేతలతో పొత్తుల కుదర్చ డంలో జనసేన అధినేత పవనకల్యాన చేసిన కృషి మరువలేనిది. తనకొచ్చిన సీట్లను సైతం త్యాగం చేసి.. అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నేతలను సైతం బుజ్జగించి అందర్నీ ఏకతాటిపైకి తెచ్చి కూటమి విజయం సాధించేలా చేశారు. జిల్లాలో పలువురు జనసైనికులు టికెట్‌ ఆశించినా.. పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సి వచ్చింది. అయినా నిరుత్సాహ పడకుండా కూటమి అభ్యర్థుల విజయం కోసం శ్రమించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల కోసం ప్రచారాలు ముమ్మరం చేశారు.


ముఖ్యంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌, ఆ పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్‌, ఆ పార్టీ రాయలసీమ మహిళా విభాగం రీజినల్‌ కో-ఆర్డినేటర్లు పెండ్యాల శ్రీలత సైనికుల్లా పోరాటం చేశారు. వీళ్లు ముగ్గురు కూటమి అభ్యర్థులను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. టీసీ వరుణ్‌ తన సొంత ఖర్చులతో బైకు ర్యాలీలు, బహిరంగ సభలతో కూటమి అభ్యర్థులను ప్రజ లకు చేరువ చేశారు. ఎప్పటికప్పుడు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయపరిచి ప్రతి డివిజనలో సమస్యలను ఎత్తిచూపడంతో పాటు... కూటమి అభ్యర్థులను గెలిపిం చాలని ప్రచారాలు చేశారు. భవాని రవికుమార్‌ సైతం ఉమ్మడి అనంత జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కూటమి టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో తనవంతు పాత్ర పోషించారు. భారీ కాన్వాయ్‌తో ప్రచారాలు నిర్వహించి కూటమి అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించారు.


ఇక పెండ్యాల శ్రీలత ఎన్నికల కోడ్‌ రాకము నుపు నుంచి వైపీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ఓ యుద్ధం చేశారు. ఆ పార్టీ మహిళా కార్యకర్తలను వెంటబెట్టుకొని అనంతపురం అర్బనలోని ప్రతి డివిజనలో తిరుగుతూ సమస్యలను తెలుసుకుంటూ వైసీపీ ప్రభుత్వ అధ్వాన పాలనపై నిప్పులు చెరిగారు. అనంతరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ సతీమణితో కలిసి ప్రచారాలు చేశారు. ఇలా కూటమి అభ్యర్థుల విజయంలో ఈ ముగ్గురు నేతలు శక్తివంచన లేకుండా కృషి చేశారనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.

Updated Date - Jun 07 , 2024 | 12:05 AM

Advertising
Advertising