ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈద్గాలో నీటి సమస్య పరిష్కారం

ABN, Publish Date - Jun 17 , 2024 | 11:24 PM

మండలంలోని కక్కలపల్లి కాలనీ పంచాయతీ పిల్లిగుండ్లకాలనీలోని ఈద్గాలో బోరు వేయించి, నీటి సమస్యను పరిష్కరించి.. ఇచ్చిన హామీని నిలుపుకున్నారు ఎమ్మెల్యే పరిటాల సునీత.

నీటి పంపిణీని ప్రారంభిస్తున్న టీడీపీ నాయకులు

అనంతపురంరూరల్‌, జూన 17: మండలంలోని కక్కలపల్లి కాలనీ పంచాయతీ పిల్లిగుండ్లకాలనీలోని ఈద్గాలో బోరు వేయించి, నీటి సమస్యను పరిష్కరించి.. ఇచ్చిన హామీని నిలుపుకున్నారు ఎమ్మెల్యే పరిటాల సునీత. ఎన్నికల ప్రచార సమయంలో స్థానిక టీడీపీ నాయకులు ఈద్‌గాలో బోరు వేచించాలని పరిటాల సునీతను విజ్ఞప్తి చేశారు.


టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామని నాడు హామీ ఇచ్చారు. అందులో భాగంగా పార్టీ అధికారంలోకి రాగానే ఈద్‌గాలో రూ.2.50 లక్షలతో బోరు వేయించారు. సోమవారం టీడీపీ సీనియర్‌ నాయకులు నెట్‌కాన చంద్రశేఖర్‌, గుర్రం మనోహర్‌నాయుడు, ఇతర నాయకులు బోరుకు మోటార్‌ బిగ్గించి నీటి సరఫరాను ప్రారంభించారు. సందర్భంగా ముస్లింలు టీడీపీ నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకట్‌, లక్ష్మినారాయణ, ఈడిగ సూరి, రాము పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 11:24 PM

Advertising
Advertising