ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

court: మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయవాదికి షోకాజ్‌ నోటీసు

ABN, Publish Date - Apr 27 , 2024 | 01:26 AM

కదిరి, ఏప్రిల్‌ 26 : మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌కు న్యాయవాదిగా వ్యవహరిస్తూ వైసీపీ అభ్యర్థి మక్బుల్‌బాషా తరఫున నామినేషన్ల పరిశీలనకు వచ్చిన ప్రసాద్‌రెడ్డిపై టీడీపీ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ తరఫు న్యాయవాది కే. ప్రభాకర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు.

కదిరి, ఏప్రిల్‌ 26 : మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌కు న్యాయవాదిగా వ్యవహరిస్తూ వైసీపీ అభ్యర్థి మక్బుల్‌బాషా తరఫున నామినేషన్ల పరిశీలనకు వచ్చిన ప్రసాద్‌రెడ్డిపై టీడీపీ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ తరఫు న్యాయవాది కే. ప్రభాకర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. దీనికి స్పందించిన కదిరి అసెంబ్లీ ఎన్నికల అధికారి వంశీకృష్ణ షోకాజు నోటీసులు జారీ చేశామన్నారు. 48గంటల్లో సమాధానం ఇచ్చిన తరువాత స్పందిస్తామని చెప్పారు.


శుక్రవారం నామినేషన్ల పరిశీలనకు ఇరుపార్టీల తరఫు న్యాయవాదులు వచ్చారు. న్యాయవాది ప్రసాద్‌రెడ్డి ఇప్పటికే మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారని, అందుకు స్పందించి మున్సిపాలిటీలో కూడా పారితోషికం తీసుకుంటున్నారని టీడీపీ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. దీనిపై సమగ్రంగా విచారణ చేసిన తరువాత చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి వివరణ ఇచ్చారు. అయితే నామినేషన్లు మొదటిరోజునే వైసీపీ అభ్యర్థి తరఫున నామినేషన వేయడానికి మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయవాదిగా ప్రసాద్‌రెడ్డి హాజరయ్యారు. దీనిపై నాలుగు రోజుల క్రితమే ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం వచ్చింది. అయినా ఎన్నికల అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడం, ఇప్పుడు షోకాజునోటీసు ఇవ్వడం ఏంటని కూటమి నాయకులు ప్రశ్నిస్తున్నారు.


మరిన్ని వార్తల కోసం...


Updated Date - Apr 27 , 2024 | 01:27 AM

Advertising
Advertising