ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఈవీఎం సా్ట్రంగ్‌రూంల భద్రత పటిష్టంగా ఉండాలి

ABN, Publish Date - Apr 16 , 2024 | 12:34 AM

పుట్టపర్తి రూరల్‌, ఏప్రిల్‌ 15: ఈవీఎంలు ఉంచిన సా్ట్రంగ్‌రూంల భద్రత పటిష్టంగా ఉండాలని, నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కలె క్టర్‌ అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు.

- కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆదేశం

పుట్టపర్తి రూరల్‌, ఏప్రిల్‌ 15: ఈవీఎంలు ఉంచిన సా్ట్రంగ్‌రూంల భద్రత పటిష్టంగా ఉండాలని, నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కలె క్టర్‌ అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వ్యవసాయ గోడౌనలో ఏర్పాటు చేసిన పుట్టపర్తిఅసెంబ్లీ నియోజకవర్గం, హిందూపురం పార్లమెంటు నియోజవర్గానికి సంబంధించిన ఈవీఎంల సా్ట్రంగ్‌రూంను, లాగ్‌బుక్‌ను కలెక్టర్‌తో పాటు ఆర్డీఓ బాగ్యరేఖ, తహసీల్దార్‌ వేణుగోపాల్‌ సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈవీఎం సా్ట్రంగ్‌రూంల భద్రత అత్యంత పటిష్టంగా, పకడ్బందీగా ఉండాలన్నారు. ఇందులో ఎటువంటి లోపాలు ఉండరాదన్నారు. సా్ట్రంగ్‌రూంలకు ఎక్కువ ద్వారాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాల్లో గట్టిపోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని ఆరు నియోజవర్గాల్లోని 1571 పోలింగ్‌కేంద్రాల్లో 1909 బ్యాలెట్‌ యూ నిట్లు, 1909 కంట్రోల్‌యూనిట్లు, 2,230 వీవీప్యాట్లు ఆయా నియోజవర్గాలకు పంపించడం జరిగిందని ఆ యన తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వేణుగోపా ల్‌, డిప్యూటీ తహసీల్దార్‌ నరసింహులు, పోలీసు సి బ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:34 AM

Advertising
Advertising