EAPSET results ఈఏపీసెట్ ఫలితాల్లో ధర్మవరం విద్యార్థినికి ర్యాంకు
ABN, Publish Date - Jun 11 , 2024 | 11:25 PM
ఈఏపీ సెట్ ఫలితాలు మంగళవారం సా యంత్రం విడుదలయ్యాయి. ఇందులో ధర్మవరం పట్టణానికి చెందిన సుప్రియ 2702 వ ర్యాంకు సాధించింది. ఈ విద్యార్థిని స్థానిక శ్రీవాసవి జూనియర్ కళాశాలలో ఇం టర్ పూర్తి చేసింది. ఇంటర్‌లో 985 మార్కులు సాధించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య తెలిపారు.
ధర్మవరం, జూన 11: ఈఏపీ సెట్ ఫలితాలు మంగళవారం సా యంత్రం విడుదలయ్యాయి. ఇందులో ధర్మవరం పట్టణానికి చెందిన సుప్రియ 2702 వ ర్యాంకు సాధించింది. ఈ విద్యార్థిని స్థానిక శ్రీవాసవి జూనియర్ కళాశాలలో ఇం టర్ పూర్తి చేసింది. ఇంటర్‌లో 985 మార్కులు సాధించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య తెలిపారు.
ఈఏపీసెట్ ఫలితాల్లో 2702 ర్యాంకు సాధించడంతో ప్రిన్సిపాల్‌తో పాటు, కళాశాల డైరెక్టర్ భాస్కర్‌రెడ్డి, అధ్యాపకులు బ్రాహ్మణ వీధిలో ఉన్నవిద్యార్థిని ఇంటికెళ్లి అబినందించారు. తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం, వీణారాణి కూడా కుమార్తెను అభినందించారు. కళాశాలకు చెందిన మౌనిక 7992, కల్యాణి 8320, ఎస్‌ఆర్‌కే ఉజ్మా 9449, ఎస్.అప్సా 9580వ ర్యాంకులు సాధించినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - Jun 11 , 2024 | 11:25 PM