ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కనులపండువగా రాములోరి చక్రస్నానం

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:58 AM

స్థానిక మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో శుక్రవారం రాములవారి చక్రస్నానాన్ని కనులపండువగా నిర్వహించారు

Priests performing chakra bath

అనంతపురం కల్చరల్‌, ఏప్రిల్‌ 26: స్థానిక మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో శుక్రవారం రాములవారి చక్రస్నానాన్ని కనులపండువగా నిర్వహించారు. కాగా ఈనెల 17వ తేదీ నుంచి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో అట్టహాసంగా ముగిసాయి. ఈ సందర్భంగా ఉదయం హనుమద్‌ సమేత సీతారామలక్ష్మణులకు వివిధ అభిషేకాలు నిర్వహించడతో పాటు ఆలయ ఆవరణంలో సుదర్శనహోమం నిర్వహించారు.


అనంతరం రుత్వికుల వేదమంత్రోచ్ఛారణ నడుమ స్వామివార్ల ఉత్సవమూర్తులకు గంధాభిషేకం, వసంతోత్సవం, చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముగింపు సూచికగా ధ్వజ అవరోహణ చేశారు. సాయంత్రం ఆలయంలో స్వామివార్లకు శాస్త్రోక్తంగా శయనోత్సవ సేవ నిర్వహించి ఉత్సవాలను ముగించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమే్‌షబాబు, అనువంశీకుడు హోసూరు రామసుబ్రహ్మణ్యం, ధర్మకర్తల మండలి సభ్యులు కల్పన, రాజేశ్వరి, వెంకటస్వామి, సురే్‌షబాబు, తిమ్మారెడ్డి, చంద్రశేఖర్‌, డి.సుబ్రహ్మణ్యం, ప్రధానార్చకుడు నరసింహశాసి్త్ర, పరమేష్‌, భక్తులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తల కోసం...

Updated Date - Apr 27 , 2024 | 12:58 AM

Advertising
Advertising