railway: బడ్జెట్‌లో రైల్వేకు అరకొర నిధులు
ABN, Publish Date - Aug 20 , 2024 | 12:18 AM
కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తమ శాఖకు కేటా యింపులపై రైల్వేబోర్డు పింక్ బుక్‌ను ఆలస్యంగా విడుదల చేసింది. జోనల వారీగా పింక్‌బుక్‌ను రిలీజ్ చేసింది. దక్షిణ మధ్య రైల్వే కు విడుదలైన నిధుల్లో గుంతకల్లు డివిజనకు అరకొరగా ఫండ్స్ వచ్చాయి.
కేటాయింపులపై పింక్ బుక్ విడుదల చేసిన రైల్వే బోర్డు
గుంతకల్లు, ఆగస్టు 19: కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తమ శాఖకు కేటా యింపులపై రైల్వేబోర్డు పింక్ బుక్‌ను ఆలస్యంగా విడుదల చేసింది. జోనల వారీగా పింక్‌బుక్‌ను రిలీజ్ చేసింది. దక్షిణ మధ్య రైల్వే కు విడుదలైన నిధుల్లో గుంతకల్లు డివిజనకు అరకొరగా ఫండ్స్ వచ్చాయి.
రైల్వే డివిజనకు వచ్చిన నిధులివే..
డివిజన పరిధిలో నిర్మాణంలో ఉన్న నడికుడి-శ్రీకాళహస్తి లైనకు మధ్యంతర బడ్జెట్‌లో రూ. 310 కోట్లు కేటాయించగా, ఆ మొత్తాన్ని జూలై బడ్జెట్‌లో రూ. 450 కోట్లకు పెంచారు. కడప- బెంగళూరు కొత్త లైనకు ఇంటీరియం బడ్జెట్‌లో నిధులు ఇవ్వకపోగా, జూలై బడ్జెట్‌లో రూ.10 కోట్లు ఇచ్చారు. గుత్తి-ధర్మవరం లైన బకాయిల కోసం రూ.100 కోట్లు కేటాయించారు. నిర్మాణంలో ఉన్న గుంతకల్లు-గుంటూరు లైనకు ఫిబ్రవరి బడ్జెట్‌లో రూ.283 కోట్లను కేటాయించగా దాన్ని రూ.480 కోట్లకు పెంచారు. రేణిగుంట, వాడి, గుత్తి బైపాస్ లైన్ల బకాయిల కింద ఫిబ్రవరి బడ్జెట్‌లో కేటాయించిన రూ. 83.30 కోట్లను, జూలై బడ్జెట్‌లో యథాతథంగా కేటాయించారు. అకోలా-డోన కొత్త లైనకు, ధర్మవరం-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులకు రెండు బడ్జెట్లలోనూ నిధులు ఇవ్వలేదు. గుత్తి-పెండేకల్లు డబ్లింగ్‌కు ఇంటీరియం బడ్జెట్‌లో రూ. 150 కోట్లను కేటాయించగా పూర్తి స్థాయి బడ్జెట్‌లో రూ. వంద కోట్ల కోతపెట్టారు. తిరుపతి శాటిలైట్ స్టేషనకు రూ. 7.41 కోట్లను కేటాయించారు. ఇవికాక ట్రాక్ రెన్యువల్స్, ఆర్‌యూబీలు తదితర పనులకు నిధుల కేటాయింపులు జరిగాయి. వీటిలో డివిజనకు నికరంగా ఏమేరకు నిధులు లభించాయో రైల్వే అధికారులు వెల్లడించాల్సి ఉంది.
Updated Date - Aug 20 , 2024 | 12:18 AM