LIGHT: అంధకారంలో ‘పురం’
ABN, Publish Date - May 26 , 2024 | 11:46 PM
పట్టణంలోని పలు ప్రాంతాలలో రెండు రోజులుగా వీధిలైట్లు వెలుగడంలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాత్రిపూట అంధకారం అలుముకుంటోంది. పట్టణ పరిధిలోని నానెప్పనగర్, లక్ష్మీపురం, డీబీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. సాధరణంగా వర్షం కురిస్తే ఇళ్లకు విద్యుత సరఫరా నిలిచిపోయినా వీధి లైట్లు వెలుగుతాయి. కానీ శనివారం రాత్రి వీధిలైట్లు వెలుగక నానెప్పనగర్ తదితర ప్రాంతాల్లో గాడాంధకారం నెలకొంది.
పలు ప్రాంతాల్లో వెలగని వీధిలైట్లు
హిందూపురం అర్బన, మే 26: పట్టణంలోని పలు ప్రాంతాలలో రెండు రోజులుగా వీధిలైట్లు వెలుగడంలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాత్రిపూట అంధకారం అలుముకుంటోంది. పట్టణ పరిధిలోని నానెప్పనగర్, లక్ష్మీపురం, డీబీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. సాధరణంగా వర్షం కురిస్తే ఇళ్లకు విద్యుత సరఫరా నిలిచిపోయినా వీధి లైట్లు వెలుగుతాయి. కానీ శనివారం రాత్రి వీధిలైట్లు వెలుగక నానెప్పనగర్ తదితర ప్రాంతాల్లో గాడాంధకారం నెలకొంది. ఇటీవల హిందూపురం ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీధిలైట్లు కూడా లేకపోతే దొంగలకు ఇది మంచి అవకాశంగా మారుతుందని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కార్డెన సెర్చ్ నిర్వహించి ఎటువంటి అల్లర్లు జరుగ కుండా జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే మునిసిపల్ అధికారులు స్పందించి ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు తావివ్వకుండా వీధిలైట్లు వెలిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
AP NEWS, Andhrapradesh, Ananthapuram, Andhra jyothi Latest News
Updated Date - May 26 , 2024 | 11:46 PM