ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pf: టీచర్ల పీఎఫ్‌ ఖాతాలు అప్‌డేట్‌ చేయాలి

ABN, Publish Date - Jul 25 , 2024 | 12:10 AM

ఉపాధ్యాయుల పీఎఫ్‌ ఖాతాలను వెంటనే అప్‌డేట్‌ చేయాలని ఏపీటీఎఫ్‌ నాయకులు కోరారు. జడ్పీ సీఈఓ ప్రభాకర్‌రావును బుధవారం ఆ సంఘం నాయకులు జడ్పీలో కలిశారు. సంఘం రాష్ట్రకార్యదర్శి నరసింహు లు, జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌, ప్రధానకార్యదర్శి సిరాజుద్దీన మాట్లాడుతూ పీఎఫ్‌ ఖాతాలు నేటికీ నవీనీకరించలేదన్నారు.

జడ్పీ సీఈఓకు ఏపీటీఎఫ్‌ వినతి

అనంతపురం విద్య, జూలై 24: ఉపాధ్యాయుల పీఎఫ్‌ ఖాతాలను వెంటనే అప్‌డేట్‌ చేయాలని ఏపీటీఎఫ్‌ నాయకులు కోరారు. జడ్పీ సీఈఓ ప్రభాకర్‌రావును బుధవారం ఆ సంఘం నాయకులు జడ్పీలో కలిశారు. సంఘం రాష్ట్రకార్యదర్శి నరసింహు లు, జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌, ప్రధానకార్యదర్శి సిరాజుద్దీన మాట్లాడుతూ పీఎఫ్‌ ఖాతాలు నేటికీ నవీనీకరించలేదన్నారు. ఎవ రి ఖాతాలో ఎంత నగదు జమ అయ్యిందో...? నెలవారీగా జమలు, వడ్డీ జమల వివరాలు తెలియకుండా ఉండటం వల్ల పీఎఫ్‌ ఖాతాలపై ఉపాధ్యాయుల్లో ఆందోళన ఉందన్నారు. వేలాది మంది టీచర్ల పార్ట్‌ ఫైనల్‌ రుణాలు, ఇతర రుణాల కోసం నెలల తరబడి జడ్పీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా...సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. అన్ని జిల్లాల్లో వార్షిక ఖాతాలు నిల్వల వివరాలు విడుదల చేసినా...అనంతపురం జిల్లాలో నేటికీ విడుదల చేయకుండా ఖాతాలను స్తంభించజేశారంటూ అసహనం వ్యక్తం చేశారు. అనారోగ్యం, పిల్లల చదువులు, ఇతర సమస్యల పరిష్కారానికి పీఎఫ్‌ రుణాలు ఆసరాగా ఉంటాయని టీచర్లు భావిస్తున్నారన్నారు. పీఎఫ్‌ ఖాతాలను వెంటనే అప్‌డేట్‌ చేయాలన్నారు. ఈ మేరకు సీఈఓకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు సతీ్‌షకుమార్‌, సభ్యులు సర్ధార్‌వలి, పాతిరెడ్డి, కిష్టప్ప, రామాంజనేయులు, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2024 | 12:10 AM

Advertising
Advertising
<