రాయలేలిన పెనుకొండ
ABN, Publish Date - Apr 27 , 2024 | 12:48 AM
విజయనగర రాజుల రెండో రాజధాని, అగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయలు ఏలిన గడ్డ పెనుకొండ. నాడు వజ్ర వైఢూర్యాల రాసులతో పాటు కళలు, కళాఖండాలతో కళకళలాడిన పెనుకొండ ఆనవాళ్లు నేటికి చెక్కచెదరలేదు.
నాడు ఫ్యాక్షన ముద్ర.. నేడు ప్రగతి జాడ
దక్షిణ కొరియా పెట్టుబడుల వరద
ప్రపంచ కార్ల దిగ్గజం కియ రాకతో పూర్వ వైభవం
పారిశ్రామిక హబ్‌గా కొత్త అధ్యాయం
భూముల ధరలకు రెక్కలు
కరువు నేలపై కృష్ణమ్మ పరవళ్లు
చెరువులకు జలసిరి.. వ్యవసాయానికి పునరుజ్జీవం
హిందూపురం/పెనుకొండ ఏప్రిల్ 26 : విజయనగర రాజుల రెండో రాజధాని, అగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయలు ఏలిన గడ్డ పెనుకొండ. నాడు వజ్ర వైఢూర్యాల రాసులతో పాటు కళలు, కళాఖండాలతో కళకళలాడిన పెనుకొండ ఆనవాళ్లు నేటికి చెక్కచెదరలేదు. ఇలాంటి గడ్డపై మూడు దశాబ్దాల పాటు రాజకీయ ఆధిపత్యం కోసం ఫ్యాక్షన, వర్గకక్షలతో రతనాలసీమలో రక్తం ఏరులైపారింది. ఒకనాడు ఫ్యాక్షన రాజకీయాలకు పెట్టింది పేరైన పెనుకొండ,నేడు పారిశ్రామిక, పర్యాటక హబ్‌గా మారి ప్రశాంత వాతావరణంలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ప్రముఖ దక్షిణ కొరియా కార్ల పరిశ్రమ కియ రాకతో ప్రపంచ పటంలో గుర్తింపు పొందుతోంది. విదేశీ, స్వదేశీ సంస్కృతులను కలబోసుకుని అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఓ వైపు పారిశ్రామిక అభివృద్ధి మరోవైపు వ్యవసాయ ప్రమాణాలను పెంచుతూ ముందుకు దూసుకుపోతుంది. కరువు కటాకాలకు అల్లాడి వలసలు వెళ్లిన వారు సైతం కృష్ణమ్మ పరవళ్లతో వెనుదిరిగి వస్తున్నారు. 1952 మొదటి సారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థి వెంగళమ్మ చెరువు లక్ష్మీనారాయణరెడ్డి ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్లు 265, మొత్తం ఓటర్లు 2,33,687 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 1,17,311, మహిళలు 1,16,372, ఇతరులు 3 ఉన్నారు. నియోజకవర్గం 3,49,593.27ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
హంద్రీనీవాలో భాగంగా 2016లో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. అదే ఏడాది డిసెంబరు నెలలో కృష్ణా జలాలను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేశారు. దీంతో పాటు కియ కార్ల పరిశ్రమ పెనుకొండ సమీపంలోని అమ్మవారిపల్లి, యర్రమంచి వద్ద ఏర్పాటైంది. ఈ పరిశ్రమకు అనుబంధంగా పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల ప్రాంతాల్లో మరో 20 పరిశ్రమలు రావడంతో వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి పడ్డాయి. పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న భూములపై కియ ప్రభావం పడడంతో లక్షలు పలికే భూములు కోట్లలోకి చేరాయి. ఫలితంగా ఆకాశాన్ని తాకే మూడు, ఐదు అంతస్థుల భవనాల నిర్మాణాలతో పెనుకొండలో కియ కార్ల పరిశ్రమతో దక్షిణ కొరియా దేశస్తులు రాక సంఖ్య పెరిగింది. ప్రజల ఆర్థిక జీవనవిధానంలో పెనుమార్పులు వచ్చాయి.
2015లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నాసెన, బెల్, ఎయిర్‌బ్‌సలు పాలసముద్రం వద్ద ఏర్పాట్లకు ముందుకొచ్చాయి. 2016లో రూ.13వేల కోట్లతో పెనుకొండ వద్ద కియ కార్ల, అనుబంధ పరిశ్రమలు, హంద్రీనీవా ప్రాజెక్ట్, గార్మెంట్స్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. హంద్రీనీవాతో చెరువులకు నీటి రాకతో చెరువులకు జలసిరి వచ్చి కరువు నేలలో పసిడి పంటలు పండుతున్నాయి. నీరు రావడంతో పెనుకొండ వైపు ప్రపంచ దేశాల పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు ఏర్పాటు కోసం పెట్టుబడులకు తొంగి చూస్తున్నాయి.
నియోజకవర్గంలో గోరంట్ల మినహా నాలుగు మండలాలకు హంద్రీనీవా మడకశిర ఉప కాలువ అనుసంధానంగా ఉంది. అయినా ప్రధానంగా చెరులన్నింటికి నీరు నింపకపోవడంతో సాగు, తాగు నీరు సమస్య ఉంది. ప్రధానంగా గోరంట్ల, పరిగి, రొద్దంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. నియోజక వర్గంలో వర్షాధార పంటలపైనే రైతాంగం ఆ ధారపడి జీవనం సాగిస్తున్నారు. రెండు ద శాబ్దాలుగా చెరువులకు నీరులేక రైతులు, కూలీలు వసలు వెళ్లారు. గోరంట్ల మండలానికి హంద్రీనీవా ద్వారా కృష్ణాజలాలు ఇవ్వాలన్న ప్రతిపాదన దశలోనే ఉంది. పెనుకొండను ప్రపంచ పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని 2010 నుంచే శ్రీకృష్ణదేవరాయలు ఉత్సవాలు అంత్యంత వైభవంగా నిర్వహించారు. నేటికీ ఇచ్చిన హామీలను పాలకులు పూర్తి చేయలేక పర్యాటకులను ఆకర్షించలేకపోతోంది. పెనుకొండ వద ్ద రైల్వే ఫ్టైఓవర్, లేక అండర్‌బ్రిడ్జ్ నిర్మాణం, గోరంట,్ల సోమందేపల్లిలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలు లేవు. చేనేతలకు ఆదరణ కరువై పవర్‌లూమ్స్ వైపు మళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పరిశ్రమలు వచ్చినా నిరుద్యోగ సమస్యకు మాత్రం చెక్‌పడలేదు.
తెలుగుదేశం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఉమ్మడి అనంత జిల్లాను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రపంచ ప్రసిద్దిగాంచిన కియా పరిశ్రమను పెనుకొండకు తీసుకొచ్చారు. దీంతో పెనుకొండ పేరును ప్రపంచ పటంలో కియా నిలిపిందనడంలో సందేహం లేదు. 2016లో రూ.13వేల కోట్లతో కియా పరిశ్రమను స్థాపించారు. అప్పట్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం, ఆయన మీదున్న నమ్మకంతో కియా పరిశ్రమ యజమాని ఇక్కడ పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చారు. ఒప్పందం ప్రకారం భూమిని ఇవ్వడంతోపాటు నీటిని అందించడం మౌళిక సదుపాయాలు ప్రభుత్వం నుంచి అనుమతులను వేగవంతం చేయించారు. చెప్పిన సమయానికంటే ముందుగానే వారికి అప్పగించడంతో శరవేగంగా కియా పరిశ్రమ ప్రారంభమైంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నాసెన, బెల్, ఎయిర్‌బస్ సంస్థలు కూడా పెనుకొండ నియోజకవర్గానికి తరలివచ్చాయి. దీంతోపాటు కియా అనుబంధ పరిశ్రమలుకూడా ఇక్కడ కొన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ రాకతో ఎకరా భూమి వేలల్లో ఉండగా ప్రస్తుతం కోట్లకు చేరింది. దీనివల్ల ఈ ప్రాంతంలోని జీవన ప్రమాణాలు, స్థితిగతులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 50వేల మందికి ఉపాధి కల్పించింది. దీనివల్ల పెనుకొండ నియోజకవర్గ రూపురేఖలు మారాయని చెప్పవచ్చు.
Updated Date - Apr 27 , 2024 | 12:48 AM