ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అట్టహాసంగా పరిటాల సునీత నామినేషన

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:55 PM

కూటమి రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత గురువారం రెండో సెట్‌ నామినేషనను అట్టహాసంగా దాఖలు చేశారు. భారీ జనసందోహంతో వెంకటాపురం నుంచి రాప్తా డు వెళ్లారు.

Dharmavarapu Murali starting a bike rally in Maruru

రామగిరి, ఏప్రిల్‌ 25: కూటమి రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత గురువారం రెండో సెట్‌ నామినేషనను అట్టహాసంగా దాఖలు చేశారు. భారీ జనసందోహంతో వెంకటాపురం నుంచి రాప్తా డు వెళ్లారు. మొదట పరిటాల రవీంద్ర ఘాట్‌కు పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. అనంతరం కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులతో కలిసి యల్లమ్మఅమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన టీడీపీ శ్రేణుల మధ్య నామినేషన దాఖలు చేయడానికి పరిటాలసునీత కాన్వాయ్‌తో బయలుదేరి వెళ్లారు. మండలంలోని నసనకోటతో పాటు పలు గ్రామాలలో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌, పరిటాల సిద్దార్థకు ప్రజలు ఘన స్వాగతాలు పలికారు.


భారీగా బైక్‌ ర్యాలీ

రాప్తాడు : పరిటాల సునీత నామినేషన సందర్భంగా మండల ఇనచార్జ్‌ ధర్మవరపు మురళి ఆధ్వర్యంలో గురువారం భారీగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మరూరు టోల్‌ గేట్‌ వద్ద నుంచి రాప్తాడు తహసీల్దార్‌ కార్యాలయం వరకూ వందల సంఖ్యలో బైక్‌లతో అభిమానులు ఈ ర్యాలీ నిర్వహించారు. ద్విచక్రవాహనాలకు టీడీపీ జండాలు కట్టుకుని ఉల్లాసంగా ర్యాలీలో పాల్గొన్నారు.


వైసీపీ నుంచి టీడీపీలోకి

ఆత్మకూరు : మండలంలోని పీ సిద్దరాంపురం గ్రామానికి చెందిని వైసీపీ యూత నాయకులు గురువారం జిల్లా కేంద్రంలోని పరిటాల క్యాంపు కార్యాలయంలో పరిటాల శ్రీరామ్‌ సమక్షంలో టీడీపీలో చేరారు.పార్టీలో చేరిన రాజనేని సురేష్‌ చైదరి, కోమలపాటి పురషోత్తం మాట్లాడుతూ... వైసీపీలో అరాచకాలను బరించలేక టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. పరిటాల సునీత గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల ఇనచార్జి బాలాజి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తల కోసం...

Updated Date - Apr 25 , 2024 | 11:55 PM

Advertising
Advertising