ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈద్గా స్థలాన్ని ఎవరూ కబ్జా చేయలేదు

ABN, Publish Date - Aug 21 , 2024 | 12:14 AM

పెడపల్లి ఈద్గా స్థలాన్ని ఎవరూ కబ్జా చేయలేదని, ఆ స్థలం రోడ్డు విస్తరణలో పో యిందని పెడపల్లి ముస్లిం మైనారిటీ నాయకులు రఫీ, గౌస్‌మోద్దీన, మున్నా, బా బ్జాన, మహబూబ్‌బాషా, అంజు స్పష్టం చేశారు.

విలేకరులతో మాట్లాడుతున్న మైనారిటీ నాయకులు

పుట్టపర్తి, ఆగస్టు 20 : పెడపల్లి ఈద్గా స్థలాన్ని ఎవరూ కబ్జా చేయలేదని, ఆ స్థలం రోడ్డు విస్తరణలో పో యిందని పెడపల్లి ముస్లిం మైనారిటీ నాయకులు రఫీ, గౌస్‌మోద్దీన, మున్నా, బా బ్జాన, మహబూబ్‌బాషా, అంజు స్పష్టం చేశారు. మంగ ళవారం వారు పుట్టపర్తిలో మాట్లాడుతూ... మండ లంలోని పెడపల్లిలో సర్వే నెంబరు 139లో 54 సెంట్లలో ఈద్గాను నిర్మించుకొని ప్రార్థన చేసేవారమని, ఇటీవల రోడ్డు విస్తరణలో ఈద్గా స్థలమంతా రోడ్డుకు పోవడం జరిగిందని అన్నారు. ప్రక్కనే ఉన్న స్థలంలో ఈద్గాను నిర్మించుకోవడానికి భూమి పూజ చేసామని, ఐతే కొంత మంది మాజీ సర్పంచు శ్రీరాంనాయక్‌ కబ్జా చేశారని విష ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఎలాంటి వాస్తవమూ లేదని అన్నారు. ఇదే విషయాన్ని ఆర్డీఓ భాగ్యరేఖకు, తహసీల్దార్‌ అనుపమకు లిఖితపూర్వకంగా తెలియచే శామన్నారు. గ్రామంలో మైనారిటీల మద్య వైషమ్యాలు విభేదాలు సృష్టించేందుకు కొంత మంది ఇలా విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Updated Date - Aug 21 , 2024 | 12:14 AM

Advertising
Advertising
<