ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA KALAVA : గంబూషియా చేపలతో దోమల నివారణ

ABN, Publish Date - Jul 31 , 2024 | 12:03 AM

అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు గంబూషియా చేపలు ఎంతో దోహదపడతాయని, దోమల నివారణలో కీలకపాత్ర పోషి స్తా యని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆయన మంగళవారం 35 వేల గంబూ షియా చేపలను 13 నీటినిలువ కేంద్రాలలో వదిలే కార్యక్రమాన్ని, పట్టణంలోని పాలబావి లో ఫాగింగ్‌ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బ్యాక్టీరి యా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా గంబూషియా చేపలను వదు లుతున్నామన్నారు.

MLA Kalava releasing Gambushia fish in Palabavi

ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం, జూలై 30 : అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు గంబూషియా చేపలు ఎంతో దోహదపడతాయని, దోమల నివారణలో కీలకపాత్ర పోషి స్తా యని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆయన మంగళవారం 35 వేల గంబూ షియా చేపలను 13 నీటినిలువ కేంద్రాలలో వదిలే కార్యక్రమాన్ని, పట్టణంలోని పాలబావి లో ఫాగింగ్‌ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బ్యాక్టీరి యా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా గంబూషియా చేపలను వదు లుతున్నామన్నారు


. ప్రజలు అంటువ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. దోమల లార్వా వృద్ధిచెందే నీటినిల్వ కేంద్రాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. మలేరియా అధికారి నాగేంద్ర, మున్సిపల్‌ కమిషనర్‌ కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆయన పట్టణంలోని బస్టాండ్‌ వద్ద అన్న క్యాంటిన కోసం నిర్మిస్తున్న భవనా న్ని పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సకాలంలో అన్న క్యాంటినను ప్రారంభించి, పేదలకు కడుపునిండా భోజనం పెట్టాలనే తమ లక్ష్యాన్ని నెరవేరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

బెళుగుప్ప: దోమలు ప్రబలకుండా గంబూషియా చేపలతో నివారించవచ్చని డాక్టర్‌ కార్తీక్‌ రెడ్డి, ఎంపీడీఓ సుబ్బరాజు తెలిపారు. మండల పరిధిలోని దుద్దేకుంట గ్రామంలోని నీటి కుంటలో మంగళవారం అధికారులు దోమల నివారణకు గంబూషియా చేపపిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ వెంకటరమణ, సర్పంచ రత్నమ్మ, టీడీపీ నాయకులు తిమ్మప్ప, రాము తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణదుర్గంరూరల్‌: సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పట్టణ పరిధిలోని ఐదుకల్లు రోడ్డుకు సమీపంలో ఉన్న సుబేదార్‌ చెరువులోకి మంగళవారం గంబుషియా చేపలను వదిలినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ నరసారెడ్డి తెలిపారు. ఈ చేపలు దోమల లార్వాలను ఆహారంగా తీసుకుంటాయని తెలిపారు. ప్రజలు కూడా రోడ్లపైకి నీరు వదలకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శుభకర రావు, డిప్యూటీ డీఎంహెచఓ రాజేష్‌, మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి తిరుపాలయ్య, వార్డు శానిటేషన, ఎన్విరానమెంట్‌ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 31 , 2024 | 12:03 AM

Advertising
Advertising
<