ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కూటమికి 140కిపైగా స్థానాలు తథ్యం

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:06 PM

రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 140కిపైగా ఎమ్మెల్యే స్థానా లు వ స్తాయని మాజీ ఎమ్మెల్సీ షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం హిందూపురంలోని మైనార్టీలున్న ప్రాంతా ల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూలదోయ డానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Iqbal talking to reporters

జగన అక్రమాలకు పాల్పడ్డాడని కేంద్రమంత్రే చెప్పారు

మైనార్టీలకు టీడీపీనే అండ

ఎన్నికల ప్రచారంలో ఇక్బాల్‌

హిందూపురం, ఏప్రిల్‌ 25 : రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 140కిపైగా ఎమ్మెల్యే స్థానా లు వ స్తాయని మాజీ ఎమ్మెల్సీ షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం హిందూపురంలోని మైనార్టీలున్న ప్రాంతా ల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూలదోయ డానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రం ఉన్న ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు.


వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని కేంద్ర మంత్రి రాజనాథ్‌సింగ్‌ చెప్పినట్లు గుర్తుచేశారు. వైసీపీ పాలనలో రూ. 13.5లక్షల కోట్లు రాష్ట్రంపై అప్పులు మిగిల్చారని ఒక్కొక్కరిపై రూ. రెండులక్షల అప్పు మోపారన్నారు. దీనిపై సమగ్ర సమాచారం ఉందని కేంద్ర మంత్రి చెప్పారంటే సీఎం జగన ఎంత అవినీతికి పాల్పడ్డాడో అర్థం అవుతుందన్నారు.


ప్రజలను ఓ వైపు ఇసుక, మద్యంలో దోచేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నగదురూపంలో మద్యం దుకాణాల్లో విక్రయా లు జరుగుతున్నాయంటే ఇది దోపిడీకి నిదర్శనమ న్నారు. మంచి పరిపాలనా దక్షుడు చంద్రబాబు అన్నా రు. ఈ రాష్ట్ర పాలన గాడిలో పడాలంటే కూటమి అభ్యర్థులు విజయం సాధించాలన్నారు. వైసీపీలో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని విమర్శించారు. ఈయన వెంట మాజీ మునిసిపల్‌ చైర్మన అనీల్‌కుమార్‌, పట్టణాధ్యక్షుడు రమేష్‌, మాజీ కౌన్సిలర్‌ హిదాయతుల్లా, డైమండ్‌బాబా, షఫీ, డా.బాష, ప్యారుసాబ్‌ తదితరులు ఉన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 25 , 2024 | 11:06 PM

Advertising
Advertising