MINISTER SAVITA : నేడు గోరంట్లలో మంత్రి పర్యటన
ABN, Publish Date - Aug 08 , 2024 | 11:56 PM
రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, జౌలి శాఖల మంత్రి సవిత మండలంలో శుక్రవారం పర్యటించనున్నట్లు టీడీపీ కన్వీనర్ సోముశేఖర్ తెలిపారు. మంత్రి హోదాలో మొదట సారి ఆమె గోరంట్లకు వస్తుండగా కూటమి నాయకులు ప్రధాన రహదారికి ఇరువైపుల ప్లేక్సీలతో స్వాగతించడానికి పోటీ పడ్డారు. ఉదయం 10గంటలకు మంత్రి గౌనివారిపల్లిలో ప్రభుత్వం చౌకధాన్యపు దుకాణాన్నిప్రారంభిస్తారు.
గోరంట్ల, ఆగస్టు 8: రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, జౌలి శాఖల మంత్రి సవిత మండలంలో శుక్రవారం పర్యటించనున్నట్లు టీడీపీ కన్వీనర్ సోముశేఖర్ తెలిపారు. మంత్రి హోదాలో మొదట సారి ఆమె గోరంట్లకు వస్తుండగా కూటమి నాయకులు ప్రధాన రహదారికి ఇరువైపుల ప్లేక్సీలతో స్వాగతించడానికి పోటీ పడ్డారు. ఉదయం 10గంటలకు మంత్రి గౌనివారిపల్లిలో ప్రభుత్వం చౌకధాన్యపు దుకాణాన్నిప్రారంభిస్తారు. అనంతరం 11గంటలకు గోరంట్లలోని ఆంజనేయస్వామి కాలనీలో రూ. పదిలక్షల వ్యయంతో సిసిరోడ్డు, మురుగునీటి కాలువ పనులకు శంకుస్తాపన, అలాగే శివాలయం కాలనీలో రూ. రెండులక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనికి భూమి పూజ నిర్వహిస్తారన్నారు. అనంతరం ఉర్దూ పాఠశాలలో పుస్తకాల పంపిణీలో మంత్రి పాల్గొంటారన్నారు కూటమి నాయకులు ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 08 , 2024 | 11:56 PM