ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Massage: మసాజ్‌.. గంటకు 2 వేలు..!

ABN, Publish Date - Sep 10 , 2024 | 11:56 PM

కియ కార్ల పరిశ్రమ ఏర్పాటుతో శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ పనిచేసే కొరియా సిబ్బంది, ఇతర ఉద్యోగుల అవసరాల కోసం మార్ట్‌లు, రెస్టారెంట్లు ఏర్పాటయ్యాయి. స్థానికులు సైతం చిన్నా చితకా వ్యాపారాలతో ఉపాధి పొందుతున్నారు.

కియ వద్ద మసాజ్‌ సెంటర్లు ఏర్పాటు

రెస్టారెంట్‌ల ముసుగులో నిర్వహణ

మసాజ్‌ పేరిట గుట్టుగా వ్యభిచారం

వైసీపీ హయాంలో ఏర్పాటు.. కొనసాగింపు

పెనుకొండ టౌన, సెప్టెంబరు 10: కియ కార్ల పరిశ్రమ ఏర్పాటుతో శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ పనిచేసే కొరియా సిబ్బంది, ఇతర ఉద్యోగుల అవసరాల కోసం మార్ట్‌లు, రెస్టారెంట్లు ఏర్పాటయ్యాయి. స్థానికులు సైతం చిన్నా చితకా వ్యాపారాలతో ఉపాధి పొందుతున్నారు. అయితే కొందరు ఇదే అదనుగా అడ్డదారిలో సంపాదనకు దిగారు. రెస్టారెంట్ల ముసుగులో మసాజ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి.. లోపల వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో పెనుకొండలో రెండు, గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో సుమారు నాలుగు మసాజ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. పాలసముద్రం వద్ద గుట్టుగా వ్యవహారం సాగుతోంది.


కానీ, పెనుకొండ వద్ద ఏకంగా గంటకు రూ.2వేలు, గంటన్నరకైతే రూ.2500 అంటూ ధరలు, సమయం వివరాలతో పోస్లర్లు ఏర్పాటు చేసి మసాజ్‌ ప్రియులను ఆహ్వానిస్తున్నారు. టీడీపీ హయాంలో మసాజ్‌ సెంటర్లను ఏర్పాటు చేసినా.. ప్రభుత్వం వాటిని గుర్తించి రెండు నెలల వ్యవధిలోనే అరికట్టింది. నిర్వాహకులకు పోలీసులు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. కానీ, వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ నాయకులు మసాజ్‌ సెంటర్లను తెరిచారు. పోలీసులు కూడా మౌనం వహించడంతో దందా యథేచ్ఛగా సాగింది. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

ఆనలైననే బుకింగ్‌

కియ సమీపంలో రెస్టారెంట్లు నిర్వహించే ప్రాంతాలను కొందరు మసాజ్‌ సెంటర్లకు అడ్డాలుగా మార్చుకున్నారు. కొరియన్లు, ఇతర రాషా్ట్రల వారికి మసాజ్‌ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఆనలైనలో బుకింగ్‌ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. గంటకు రూ.2 వేలు, గంటన్నరకు రూ.2500 చొప్పున ధరలు నిర్ణయించారు. నాలుగు నెలల వ్యవధిలో ఏడు మసాజ్‌లు చేయించుకుంటే రూ.10 వేలు మాత్రమే అంటూ ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు. ధరల వివరాలు తెలిసేలా మసాజ్‌ సెంటర్ల వద్ద పోస్టర్లు కూడా ఏర్పాటు చేశారు.


వేరే ప్రాంత మహిళలతో..

పెనుకొండ నియోజకవర్గంలో ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలతో మసాజ్‌ చేయిస్తున్నారు. పెనుకొండ డీఎస్పీ కార్యాలయం ఎదురుగా ఒకటి, జాతీయ రహదారి సమీపంలో కింగ్‌ మసాజ్‌ సెంటర్‌ పేరిట ఒకటి, పాలసముద్రం వద్ద పలుచోట్ల మసాజ్‌ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఇక్కడ ‘వ్యాపారం’ జోరుగా సాగుతోందని సమాచారం. మసాజ్‌ సెంటర్లను నిర్వహిస్తే.. నిబంధనల మేరకు మహిళలకు మహిళలు, పురుషులకు పురుషులు మాత్రమే మసాజ్‌ చేయాలి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా వ్యవహారం సాగుతోంది. పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. దీనిపై పెనుగొండ సీఐ రాఘవన్‌ను స్పందిస్తూ.. ఇప్పటికే రెండు మసాజ్‌ సెంటర్ల నిర్వాహకులను పిలిపించి తీవ్రంగా హెచ్చరించామని చెప్పారు. నిబంధనల మేరకు మసాజ్‌ చేయాలని, అలాకాకుండా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా, మహిళలతో పురుషులకు మసాజ్‌ చేయించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించామని తెలిపారు.

Updated Date - Sep 10 , 2024 | 11:57 PM

Advertising
Advertising