MS: రాక్షస పాలనకు చరమగీతం పాడుదాం
ABN, Publish Date - May 02 , 2024 | 12:08 AM
వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడుదామని, చంద్రబాబును ముఖ్యమం త్రిని చేసుకుని మంచి పాలన పొందుదామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు పిలుపునిచ్చారు. ఆయన బుధవారం టీడీపీ నియోజకవర్గం సమన్వయ కర్త గుం డుమల తిప్పేస్వామితో కలిసి పట్టణంలోని శివాపురం, మారుతీనగర్, చిల్లెచిక్కనబండ, నాగన్నకుంట, వడ్రపా ళ్యం తదితర కాలనీల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధి కారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామన్నా రు.
టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు
మడకశిరటౌన, మే 1: వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడుదామని, చంద్రబాబును ముఖ్యమం త్రిని చేసుకుని మంచి పాలన పొందుదామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు పిలుపునిచ్చారు. ఆయన బుధవారం టీడీపీ నియోజకవర్గం సమన్వయ కర్త గుం డుమల తిప్పేస్వామితో కలిసి పట్టణంలోని శివాపురం, మారుతీనగర్, చిల్లెచిక్కనబండ, నాగన్నకుంట, వడ్రపా ళ్యం తదితర కాలనీల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించా రు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధి కారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామన్నా రు. ఆగిపోయిన ప్రతిపనిని పూర్తి చేస్తామని, మడకశి రను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి చేసిన అవినీతిని ఎండగట్టారు. వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి అవినీతికి భయపడి తెరుచుకోని గార్మెంట్స్ పరిశ్రమను టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెరిపించి యువతకు ఉపాధి కల్పిస్తామని భరో సా ఇచ్చారు.
నగర పంచాయతీ పరిధిలో ఆగిపోయిన రెండు వేల ఇళ్లను తిరిగి నిర్మిస్తామని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఇళ్ల వద్దకు వెళ్లి టీడీపీ మేనిఫెస్టోను వివరించారు. అవినీతి రహిత పాలనను అందించే చంద్రబాబును అందరూ ఆశీర్వదిం చాలని కోరారు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటువేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతి కాలనీలలోను స్థానిక ప్రజలు పూలవర్షం కురిస్తూ బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, జిల్లాకార్య నిర్వాహక కార్యదర్శి రాధాకృష్ణ, టీడీపీ జిల్లా మైనారిటీ అధ్యక్షులు భక్తర్, నాయకులు మనో హర్, ఓబుళేషు, మాధవరాజు, ఉమాశంకర్, తిమ్మరాజు, మాజీ మున్సిపల్ ఛైర్మన సుబ్బరాయడు, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 02 , 2024 | 12:08 AM