YCP : కాళ్లున్నా.. వైకల్యమట..!
ABN, Publish Date - Jun 21 , 2024 | 12:16 AM
పింఛన కోసం వైసీపీ వర్గీయులు అడ్డదారిని ఎంచుకున్నారు. దొడ్డిదారిన పీహెచ సర్టిఫికెట్ తెచ్చుకుని.. నెలనెలా అప్పనంగా రూ.3 వేలు పింఛన తీసుకుంటున్నారు. విడపనకల్లు మండలంలోని చీకలగురికి గ్రామానికి చెందిన ఇద్దరు వైసీపీ వర్గీయులు కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ ఆర్థో డాక్టర్ వద్దకు వైకల్యం ఉన్నట్లు 2023లో సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.30 వేలు చెల్లించారని సమాచారం. కొత్తపల్లి ఎర్రిస్వామి అనే వ్యక్తికి ఎలాంటి వైకల్యం లేదు. గ్రామంలో చక్కగా తిరుగుతున్నాడు. కానీ 40 శాతం వైకల్యం ఉన్నట్లు చూపించి..
వైసీపీవారికి దొడ్డిదారిన పింఛన్లు

దివ్యాంగుల కోటాలో (ఐడీ నంబరు 11200207155) నెల నెలా రూ.3 వేలు పింఛన పొందుతున్నాడు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేల పింఛన అందుకునేందుకు సిద్ధమయ్యాడు. చాకలి ఎర్రిస్వామి అనే వ్యక్తికి కూడా వైకల్యం లేదు. కానీ 57 శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ సంపాదించారు. ఐడీ నంబరు 11200203956 కింద నెల నెలా రూ.3వేలు పింఛన తీసుకుంటున్నాడు. ఈయన కూడా కొత్త పింఛన కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. మోకాలి నొప్పితో బాధపడే వ్యక్తికి ఏకంగా కాలు లేనట్లు వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అక్రమంగా పింఛన పొందుతున్నవారిపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని సర్పంచ కొత్తపల్లి ఎర్రెమ్మ తెలిపారు.
- విడపనకల్లు
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 21 , 2024 | 12:16 AM