ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మానవ అక్రమ రవాణా అమానవీయం

ABN, Publish Date - Jul 31 , 2024 | 12:01 AM

మానవ అక్రమ రవాణా అమానవీయం, అనాగరికమని కదిరి న్యాయాధికారులు పేర్కొన్నారు.

మాట్లాడుతున్న న్యాయాధికారి జయలక్ష్మి

కదిరి లీగల్‌, జూలై 30: మానవ అక్రమ రవాణా అమానవీయం, అనాగరికమని కదిరి న్యాయాధికారులు పేర్కొన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురష్కరించుకుని స్థానిక బాలికల జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర ప్రసాద్‌ అధ్యక్షతన మంగళవారం ఓ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన, సీనియర్‌ న్యాయాధికారి ఎస్‌. జయలక్ష్మి హాజరయ్యారు. సదస్సులో అక్రమ రవాణా అయి.. నరకయాతన అనుభవించి ఆ చెర నుంచి విముక్తి పొందిన పలువురు మహిళలు తాము పడి న బాధలు వివరించారు. అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తామే ముందుండి పోరాడుతామన్నారు.


అనంతరం న్యాయాధికారులు మాట్లాడుతూ.. ఈ సామాజిక రుగ్మతను నివారించడానికి అధికార యంత్రాంగం కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. అక్రమ రవాణాలో ప్రధానంగా మహిళలే బలి అవుతున్నారని, ఇది సమాజానికి హానిక రమని అన్నారు. బాధితులు లోక్‌అదాలత ద్యారా న్యాయ సహాయం పొందడానికి అనేక అవకాశాలు ఉంటా య న్నారు. అనంతరం స్కూల్‌ పిల్లలకు పుస్తకాలు, బ్యాగులు అందజేశారు. న్యాయాధికారులు ఎస్‌. ప్రతిమ, పి.మీనాక్షి సుందరి రెడ్స్‌ సంస్థ అధ్యక్షురాలు భానూజ, న్యాయవాది లోకేశ్వరరెడ్డి, లెక్చరర్‌ ప్రశాంత పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 12:01 AM

Advertising
Advertising
<