annamayya: ఘనంగా అన్నమయ్య జయంతి
ABN, Publish Date - May 24 , 2024 | 12:12 AM
పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి వేడుకలు పట్టణంలోని శ్రీలలిత నాట్యకళానికేతన నాట్య గురువులు బాబూబాలాజీ, కమలాబాలాజీ, రామలాలిత్య ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి.
ధర్మవరం, మే 23: పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి వేడుకలు పట్టణంలోని శ్రీలలిత నాట్యకళానికేతన నాట్య గురువులు బాబూబాలాజీ, కమలాబాలాజీ, రామలాలిత్య ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా వారు 60 మంది చిన్నారులతో కలిసి ర్యాలీగా స్థానిక లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే చిన్నారులు అన్నమయ్య సంకీర్తనలకు భరతనాట్యం, కూచిపూడి, కోలాటం ప్రదర్శించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - May 24 , 2024 | 12:13 AM