ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP NEWS: వైసీపీ ఎమ్మెల్యే చిల్లర రాజకీయం.. ఫైర్ అయిన సొంత పార్టీ నేత..!

ABN, Publish Date - Mar 06 , 2024 | 04:44 PM

జిల్లాలోని గుంతకల్లు నియోజకవర్గం వైసీపీ(YSRCP)లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బీసీలను ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి(MLA Venkatarami Reddy) అడుగడుగునా అవమానిస్తున్నారని మాజీ ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పామిడి పట్టణంలో బుధవారం వైఎస్సార్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు.

అనంతపురం, మార్చి 06: జిల్లాలోని గుంతకల్లు నియోజకవర్గం వైసీపీ (YSRCP) లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి(MLA Venkatarami Reddy) తీరుపై ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను ఉద్దేశించి ప్రారంభించిన పథకంపై మహిళలనే మాట్లాడనీయరా? అంటూ ఫైర్ అయ్యారు. బుధవారం నాడు పామిడి పట్టణంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, ఏడీసీసీ చైర్ పర్సన్ లిఖిత, ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు సహా స్థానిక నాయకులు, ప్రజలు హాజరయ్యారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మాత్రమే ప్రసంగించి.. ఇతరులను ప్రసంగించకుండానే సభను ముగించే ప్రయత్నం చేశారు. ఇంతలో ఏడీసీసీ బ్యాంక్ చైర్ పర్సన్ లిఖిత మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఎమ్మెల్యే అడ్డుకున్నారు. ఇక్కడ ఎవరూ మాట్లాడటానికి వీలులేదని, సమయం అయిపోయిందని అన్నారు. దాంతో అక్కడే ఉన్న వీరాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల సభకు.. మహిళా సంఘాల ప్రతినిథులు హాజరైన సభలో మహిళలను మాట్లాడనివ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇదేం పద్ధతని నిలదీశారు. సీఎం గురించి మహిళలు రెండు మాటలు మాట్లాడితే తప్పేంటి? అని ప్రశ్నించారు.

మరోవైపు ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదని, టైమ్ లేదని వీరాంజనేయులుని ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి వారించారు. ‘ఏయ్ ముందు నువ్వు స్టేజి మీద నుంచి పోవయ్యా’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే ఆదేశాలతో స్టేజ్ మీదకు వచ్చిన పోలీసులు.. వీరాంజనేయులిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

Big Breaking: దళిత మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఘోరంగా అవమానించిన సీఎం జగన్

AP Politics: గుట్టల్ని కొట్టడం, పోర్టులను విక్రయించడం సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల విసుర్లు

AP News: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆగని జగన్ ప్రభుత్వ అరాచకాలు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 05:17 PM

Advertising
Advertising