insurence: ఈ ఏడాది ఫ్రీనే
ABN, Publish Date - Sep 10 , 2024 | 12:37 AM
ఈ ఏడాది ఖరీఫ్ సీజనలో సాగు చేసిన పలు రకాల పంటలకు ఉచిత పంటల బీమాను వర్తింప జేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజనకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది. ఈ మేరకు సోమవారం గెజిట్ నోటిఫికేషన విడుదల చేసింది. జిల్లాలో ఉచిత పంటల బీమాను అగ్రికల్చర్ ఇన్సూరెన్స కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తుంది.
ఈ ఖరీఫ్‌కు ఉచిత పంటల బీమా వర్తింపు
రబీ నుంచి రైతులు ప్రీమియం కట్టాల్సిందే
గెజిట్ నోటిఫికేషన జారీ
అనంతపురం అర్బన, సెప్టెంబరు 9: ఈ ఏడాది ఖరీఫ్ సీజనలో సాగు చేసిన పలు రకాల పంటలకు ఉచిత పంటల బీమాను వర్తింప జేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజనకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది. ఈ మేరకు సోమవారం గెజిట్ నోటిఫికేషన విడుదల చేసింది. జిల్లాలో ఉచిత పంటల బీమాను అగ్రికల్చర్ ఇన్సూరెన్స కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజనలో సాగు చేసిన వేరుశనగ, పత్తి, దానిమ్మ, చీనీ, టమోటా, అరటి పంటలకు వాతావరణ ఆధారిత ఉచిత పంటల బీమాను వర్తింపజేశారు. రబీలో టమోటా పంట వాతావరణ ఆధారిత ఉచిత పంటల బీమాను వర్తింపజేశారు. దిగుబడి ఆధారిత బీమా కింద ఖరీఫ్ సీజనలో కంది, వరి, మొక్కజొన్న, జొన్న పంటలు చేర్చారు. రబీ సీజనలో పప్పుశనగ, వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ పంటకు వర్తింపజేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజనకు మాత్రమే రైతులకు ఉచిత పంటల బీమాను వర్తింపజేస్తారు.
ఈ పంట నమోదు ఆధారంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో ఉచిత పంటల బీమాను అమలు చేస్తారు.
ఈ ఏడాది రబీ నుంచి ప్రీమియం చెల్లించాల్సిందే
ఈ ఏడాది రబీ నుంచి రైతులు పంటల వారిగా బీమా వర్తింపు కోసం నిర్దేశించిన ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ పంట నమోదుతోపాటు బ్యాంకుల్లో రుణం తీసుకునే రైతులు బ్యాంకుల్లోనే ప్రీమియం చెల్లించాలి. రుణం తీసుకోని రైతులు కామన సర్వీస్ సెంటర్లల్లో డీడీ తీసి అగ్రికల్చర్ ఇన్సూరెన్స కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆఫీస్‌కు పంపాల్సి ఉంటుంది. ఈ ఏడాది రబీ సీజన నుంచి వేరుశనగకు 2 శాతం ప్రీమియం, పత్తికి 3 శాతం, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
Updated Date - Sep 10 , 2024 | 12:37 AM