MINISTER SAVITA : అతిసార బాధితులకు మెరుగైన వైద్యసేవలందించండి
ABN, Publish Date - Aug 24 , 2024 | 12:19 AM
రొళ్ల మండలంలోని ఎం రాయాపురం, గుడిబం డ మండలంలోని కొంకల్లు గ్రామాల్లో పా రిశుధ్యానికి ప్రాధాన్యమిస్తూనే, అతిసార బాధితులకు మెరుగైన వైద్యసేవ లందిం చాలని జిల్లావైద్యాధికారి మంజువాణిని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. ఈ మేరకు మంత్రి సవిత జిల్లావైద్యాధికారి మంజువాణి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మల్లికార్జునను శుక్రవారం ఫోన ద్వారా ఆదేశించారు. ఆ రెండు గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు.
జిల్లా వైద్యాధికారి మంజువాణికి మంత్రి సవిత ఆదేశం
మడకశిర, ఆగస్టు 23 : రొళ్ల మండలంలోని ఎం రాయాపురం, గుడిబం డ మండలంలోని కొంకల్లు గ్రామాల్లో పా రిశుధ్యానికి ప్రాధాన్యమిస్తూనే, అతిసార బాధితులకు మెరుగైన వైద్యసేవ లందిం చాలని జిల్లావైద్యాధికారి మంజువాణిని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. ఈ మేరకు మంత్రి సవిత జిల్లావైద్యాధికారి మంజువాణి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మల్లికార్జునను శుక్రవారం ఫోన ద్వారా ఆదేశించారు. ఆ రెండు గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. గ్రామాల్లో సాధారణ పరిస్థితి వచ్చేంతవరకు వైద్యశిబిరాలను కొనసాగించాలన్నారు. సురక్షిత మైన తాగు నీటిని సరఫరా చేయాలని, కాచి చల్లార్చిన నీరు వేడి భోజనం చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు పచచాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నారు. పరిసరాల పరిశు భ్రతపట్ల ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు.
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందనే విషయంపై బాధితుల్లో భరోసా నింపాలని జిల్లావైద్యాధికారిని ఆదేశించారు. ప్రస్తుతం కురుస్త్తున్న వర్షాల నేపఽథ్యం లో జిల్లా అంతంటా అతిసార నివారణ ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు సంక్షేమ హా స్టళ్లను సందర్శించి విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు.
రాయాపురాన్ని సందర్శించిన అధికారులు
రొళ్ల, ఆగస్టు 23 : మండలంలోని ఎం రాయాపురం గ్రామంలో పారిశుధ్యం లోపంతో అతిసారం ప్రబలి ప్రజలు అనారోగ్యం బారినపడ్డారు. ఈనేపథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశాల మేరకు డీఎంహెచఓ మంజువాణి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మల్లికార్జున శుక్రవారం గ్రామంలో పర్యటించారు. ప్రస్తుతం గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. గ్రామంలో సాధారణ పరిస్థితి వచ్చే వరకు వైద్యశిబిరాలు కొనసాగించాలని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, పారిశుధ్యం వందశాతం చేయించాలని సిబ్బందికి ఆదేశించారు. ఈసందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మల్లికార్జున గ్రామంలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు.
అన్నదానం : ఎం రాయాపురం గ్రామంలో అతిసార వ్యాధితో బా ధపడుతున్న కుటుంబాలకు వైద్య సేవలు అందించడానికి వచ్చిన సిబ్బందికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పే స్వామి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు అన్నదానం ఏర్పాటు చేశా రు. రాష్ట్ర వక్కలిగ కన్వీనర్ పాండురంగప్ప, జిల్లా కార్యదర్శి రవిభూషణ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనాథ్, టీడీపీ నాయకులు చంద్రప్ప, బీజేపీ నాయకులు ముద్దరాజు తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో సాధారణ పరిస్థితి వచ్చే వరకు వైద్యశిబిరాలు కొనసాగించాలని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, పారిశుధ్యం వందశాతం చేయించాలని సిబ్బందికి ఆదేశించారు. ఈసందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మల్లికార్జున గ్రామంలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు.
అన్నదానం : ఎం రాయాపురం గ్రామంలో అతిసార వ్యాధితో బా ధపడుతున్న కుటుంబాలకు వైద్య సేవలు అందించడానికి వచ్చిన సిబ్బందికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పే స్వామి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు అన్నదానం ఏర్పాటు చేశా రు. రాష్ట్ర వక్కలిగ కన్వీనర్ పాండురంగప్ప, జిల్లా కార్యదర్శి రవిభూషణ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనాథ్, టీడీపీ నాయకులు చంద్రప్ప, బీజేపీ నాయకులు ముద్దరాజు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 24 , 2024 | 12:19 AM