ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వర్షం రాకతో రైతుల్లో హర్షం

ABN, Publish Date - Aug 14 , 2024 | 12:05 AM

నెల రోజులుగా దోబూచులాడిన వరుణ దేవుడు ఎట్టకేలకు సోమవారం రాత్రి కరుణించాడు. మండలంలో 37.2 మి.మి వర్షం కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లారేదాకా కుండపోత వర్షం కురిసింది. వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మొక్కజొన్న, వేరుశనగ పంటలను విత్తుకున్న

చిలమత్తూరు, ఆగస్టు 13: నెల రోజులుగా దోబూచులాడిన వరుణ దేవుడు ఎట్టకేలకు సోమవారం రాత్రి కరుణించాడు. మండలంలో 37.2 మి.మి వర్షం కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లారేదాకా కుండపోత వర్షం కురిసింది. వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మొక్కజొన్న, వేరుశనగ పంటలను విత్తుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో మండలంలో వర్షం కురవలేదు. అయితే సోమవారం కురిసిన వర్షంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పంటలకు కావాల్సినంత తేమ దొరికింది. దీంతో పంట కొంత వరకు చేతికందే అవకాశం ఉందని రైతులు పేర్కొన్నారు.


యూరియా కొరత

వర్షం కురవడంతో సాగుచేస్తున్న మొక్కజొన్న పంటకు వేసుకోవడం కోసం రైతులు యూరియా కోసం దుకాణాలకు పరుగులు తీశారు. అనుకోకుండా డిమాండ్‌ పెరగడంతో అన్ని దుకాణాల్లో నిల్వలు లేకుండా పోయాయి. పలువురు రైతులు దుకాణాల వద్ద నుంచి వెనుదిరిగిపోయారు. వర్షం ఆశించిన స్థాయిలో కురవడంతో పంటకు ఎరువు వేసుకోవడానికి అనుకూలంగా ఉంది. కానీ యూరియా దొరక్కపోవడంతో చాలా మంది రైతులు కర్ణాటకలోని బాగేపల్లికి తరలివెళ్లారు.


కూలిన పాఠశాల ప్రహరీ

హిందూపురం అర్బన: మండల పరిధిలోని కిరికెర బసవనపల్లి ఉన్నత పాఠశాల ప్రహరీ సోమవారం రాత్రి కురిసిన వర్షానికి కూలిపోయింది. ఆ గోడ చాల కాలంగా ఒక పక్కకు ఒరిగి ఉండేది. రాత్రి వేళ కూలడంతో ప్రమాదం తప్పింది. విదార్థులు లేకపోవడంతో అంద రూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు స్పందించి ప్రహరీని నిర్మించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Aug 14 , 2024 | 12:05 AM

Advertising
Advertising
<