ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: పరిటాల రవీంద్రకు కుటుంబసభ్యుల ఘన నివాళులు.. జనసంద్రంగా వెంకటాపురం

ABN, Publish Date - Jan 24 , 2024 | 11:22 AM

Andhrapradesh: దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 19వ వర్ధంతి సందర్భంగా కుటుంబసభ్యులు నివాళులర్పించారు. రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో పరిటాల రవి వర్ధంతిని పురస్కరించుకుని భారీగా ఏర్పాట్లు చేశారు.

శ్రీసత్యసాయి జిల్లా, జనవరి 24: దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 19వ వర్ధంతి సందర్భంగా కుటుంబసభ్యులు నివాళులర్పించారు. రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో పరిటాల రవి వర్ధంతిని పురస్కరించుకుని భారీగా ఏర్పాట్లు చేశారు. పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత(Former Minister Paritala Sunitha) , పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. జోహార్ పరిటాల రవన్న, పరిటాల రవి ఆశయాలను కొనసాగిద్దాం అంటూ నేతలు, అభిమానులు నినాదాలు చేశారు. పరిటాల రవీంద్ర స్వగ్రామం వెంకటాపురం జనసంద్రంగా మారింది.

పరిటాల రవి ఓ శక్తి: సునీత

పరిటాల రవి ఒక వ్యక్తి కాదు.. ఆయన ఒక శక్తి అని పరిటాల సునీత అన్నారు. భూమి ఉన్నంత వరకు పరిటాల రవిని మర్చిపోరన్నారు. ఆయన చేసిన కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోతారని తెలిపారు. ఆయన ఆశయాలను పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు.

మమ్మల్ని నడిపిస్తోంది అదే: శ్రీరామ్

పరిటాల రవి స్ఫూర్తి, ఆత్మనే తమను నడిపిస్తోందని పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఆయన చనిపోయి 19ఏళ్లు అవుతుందంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎన్ని రోజులు బ్రతికామన్నది కాదు.. ఎలా బ్రతికామన్నది ముఖ్యమన్నారు. అలాంటి వ్యక్తికి కొడుకుగా పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. తమను ఇన్ని రోజులుగా నడిపిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.


ధర్మవరంలో ఘనంగా ...

మరోవైపు ధర్మవరంలో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 19వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, పరిటాల అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. పరిటాల రవీంద్ర వర్ధంతిని పురస్కరించుకొని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల కేంద్రాలలో అభిమానులు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వెంకటాపురంలో ఉన్న పరిటాల రవీంద్ర ఘాట్‌ను సందర్శించేందుకు పరిటాల రవీంద్ర అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 24 , 2024 | 11:27 AM

Advertising
Advertising