ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

water problem: చౌటకుంటపల్లిలో తాగునీటి ఎద్దడి

ABN, Publish Date - May 20 , 2024 | 12:38 AM

మండలంలోని చౌటకుంటపల్లిలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత మూడునెలల నుంచి తాగునీటి తీవ్రంగా నెలకొందని గ్రామస్థులు వాపోతున్నారు.

- ఇబ్బంది పడుతున్న గ్రామస్థులు

- పట్టించుకోని అధికారులు, పాలకులు

నల్లమాడ, మే 19: మండలంలోని చౌటకుంటపల్లిలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత మూడునెలల నుంచి తాగునీటి తీవ్రంగా నెలకొందని గ్రామస్థులు వాపోతున్నారు. ఉన్న రెండు పంచాయతీ బోర్లలో భగర్భ జలాలు అడుగంటాయని, దీంతో సమస్య నెలకొందని అంటున్నారు. మొన్నటి దాకా ఒక బోరులో మాత్రం అరకొరగా వచ్చేవని, ఆ నీటితో పశువుల నీటి తొట్టిని నింపేవారని, చేసేదిలేక తాము అక్కడనుంచి నీటిని తెచ్చుకునేవారమని చెబుతున్నారు.


ప్రస్తుతం ఆబోరులోంచి కూడా నీరు రాలేదన్నారు. దీంతో గుక్కెడు నీరు దొరక్క విలవిల్లాడుతున్నామంటున్నారు. గ్రామంలోని స్థానక నాయకులు కొద్ది రోజులుగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని, అయితే అవి ఎక్కడా చాలడం లేదని వాపోతున్నారు. గ్రామంలో సత్యసాయి నీటి కొళాయిలు ఉన్నాయని, సత్యసాయి తాగునీటిని గ్రామానికి సరఫరా చేసినా కొంతవరకు సమస్య తీరుతుందని పేర్కొంటున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి గ్రామంలో నెలకున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 20 , 2024 | 12:38 AM

Advertising
Advertising