ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA SUNITHA: రైతులను కించపరిచేలా మాట్లాడవద్దు

ABN, Publish Date - Jul 31 , 2024 | 11:51 PM

రైతులను కించపరిచేలా అధికారులు మాట్లాడితే సహించేది లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఎమ్మెల్యే స్వగ్రామమైన వెంకటాపురంలో రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, ఆత్మకూరు వెస్ట్‌ ఏడీ తదితరులతో సమీక్ష నిర్వహించారు.

MLA Paritala Sunitha talking to the officials of the Electricity Department

రామగిరి, జూలై 31: రైతులను కించపరిచేలా అధికారులు మాట్లాడితే సహించేది లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఎమ్మెల్యే స్వగ్రామమైన వెంకటాపురంలో రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, ఆత్మకూరు వెస్ట్‌ ఏడీ తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కొన్నినెలలుగా విద్యుత పరంగా ఎదురవుతున్న సమస్యల గురించి రైతులు పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారని, అయినా దీనిపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చాలామంది రైతులు విద్యుత ప్రమాదాల వల్ల మృత్యువాత పడుతున్నారని, దీనిపై దృష్టిసారించాలన్నారు. ట్రాన్సఫార్మర్ల కోసం డబ్బులు చెల్లించి ఏళ్లు గడుస్తున్నా ఎందుకు మంజూరు చేయలేదని ఆరాతీశారు. వైసీపీ నాయకులకు అడిగిన వెంటనే ట్రాన్సఫార్మర్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. రైతుల విషయంలో రాజకీయాలు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత సమస్యలు ఎక్కడున్న వెంటనేస్పందించాలని ఆదేశించారు. ట్రాన్సపార్మర్ల విషయంలో సీనియార్టీ ప్రాతిపదికన వెంటనే మంజూరు చేయాలన్నారు. సమావేశంలో సీకేపల్లి ఏడీ నాగేంద్ర, వెస్ట్‌ ఏడీ రవిశంకర్‌, రామగిరి ఏఈ వెంకటేశ్వర్లు, ఆత్మకూరు ఏఈ దాసు, ఎల్‌ఎంలు పరమేశ్వర, సంజీవరెడ్డి పాల్గొన్నారు.


జ్యోతీబా ఫూలే పాఠశాల తనిఖీ: మండలంలోని నసనకోట సమీపంలో ఉన్న మహాత్మాజ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాలసునీత బుధవారం తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనంచేశారు. పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో కలిసి తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలకు పంపిణీచేసే సరుకులు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరల నాణ్యతను ఆమె పరిశీలించారు. భోజనశాల, తరగతి గదుల్లో పారిశుధ్య పరిస్థితులను చూసి సిబ్బందికిసూచనలు చేశారు. విద్యార్థినులకు అందించే భోజన నాణ్యతను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకా పరిస్థితి మెరుగుపడాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ఆరాతీశారు. పాఠశాల అభివృద్ధికి, కావాల్సిన అవసరాలను వినియోగించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ఎంతోమందికి ఉపయోగపడేలా గురుకుల పాఠశాలను తీసుకువచ్చామన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 11:51 PM

Advertising
Advertising
<