కొనసాగిన టీడీపీ సంబరాలు
ABN, Publish Date - Jun 13 , 2024 | 11:54 PM
సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మాజీ మేయర్ స్వరూప చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
అనంతపురం అర్బన, జూన 13: సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మాజీ మేయర్ స్వరూప చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గురువారం 30వ డివిజన పరిధిలోని అరవిందనగర్‌లో శివసాయి మహిళా సంఘం సభ్యులతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు ప్రశాంతి, నాగేంద్రమ్మ, రాధా, వనజ, నాగమణి, పూజ, శ్రీదేవి, పర్వీన పాల్గొన్నారు.
అనంతపురంరూరల్: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మండలంలోని కక్కలపల్లిలో టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. హిందుపురం పార్లమెంట్ బీసీ సెల్ కార్యదర్శి నారాయణస్వామి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. బాణా సంచాన పేల్చి.. రంగులు చల్లుకుని, కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో బండి నరసింహులు, వెంకటేష్, అన్వర్‌బాషా, నాగేష్, శంకర్‌రెడ్డి, ఆదినారాయణ పాల్గొన్నారు.
పలు ఆలయాల్లో..: మండలంలోని చియ్యేడులో టీడీపీ విజయంపై నాయకులు దేవుళ్లకు మొక్కులు చెల్లించుకున్నారు. చియ్యేడు లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో నాయకులతో ర్యాలీగా వెళ్లుతూ.. గ్రామంలోని దేవుళ్లకు 101 టెంకాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చండ్రాయుడు, రమణమ్మ, రాంమూర్తి, పరమేశ్వరరెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.
Updated Date - Jun 13 , 2024 | 11:54 PM