Godown : నిధుల కొరతతో ఆగిపోయిన గోదాముల నిర్మాణం
ABN, Publish Date - Apr 29 , 2024 | 12:16 AM
రైతులు పండించే పంటలు స్థానికంగా నిల్వ ఉంచడానికి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గోదాముల నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. నిధులు కొరతతో గోదాముల నిర్మాణాలు వివిధ దశల్లో నిల్చిపోయాయి. రైతులు పండించిన పంటలు నిల్వ ఉంచడానికి మడకశిర మార్కెట్ యార్డు పరిధిలో స్థలాన్ని సేకరించారు. జమ్మానిపల్లి, మెళవాయి, మడకశిర, కదిరేల్లి, సీ కోడిగేపల్లి, బుళ్లసముద్రం, ఆమిదాలగొంది, గుడిబండ, మందలపల్లి, మోరుబాగులు, అలుకూర్, రొళ్ల, అమరాపురం గ్రామాల్లో 13 గోదాముల నిర్మాణాలకు 2022లో రూ.2.86 కోట్లు కేటాయించారు.
నెరవేరని సీఎం జగన హామీలు
మడకశిర రూరల్, ఏప్రిల్ 28: రైతులు పండించే పంటలు స్థానికంగా నిల్వ ఉంచడానికి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గోదాముల నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. నిధులు కొరతతో గోదాముల నిర్మాణాలు వివిధ దశల్లో నిల్చిపోయాయి. రైతులు పండించిన పంటలు నిల్వ ఉంచడానికి మడకశిర మార్కెట్ యార్డు పరిధిలో స్థలాన్ని సేకరించారు. జమ్మానిపల్లి, మెళవాయి, మడకశిర, కదిరేల్లి, సీ కోడిగేపల్లి, బుళ్లసముద్రం, ఆమిదాలగొంది, గుడిబండ, మందలపల్లి, మోరుబాగులు, అలుకూర్, రొళ్ల, అమరాపురం గ్రామాల్లో 13 గోదాముల నిర్మాణాలకు 2022లో రూ.2.86 కోట్లు కేటాయించారు.
ఒక్కొక్క గోదాము నిర్మాణం రూ.22 లక్షలతో చేపట్టారు. మొదటి దశలో నిధులు విడుదల కావడంతో గోదాముల నిర్మాణాలు పునాదులు వేసి, గోడలవరకు పనులు చేపట్టారు. రెండో దశ పనులు ప్రాంభించడానికి నిధులు విడుదల కాకపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. మూడేళ్లు గడిచినా పనులు పూర్తికాలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వపై రైతులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమీలేదు - వెంకటరెడ్డి, రైతు, సీ కోడిగేపల్లి
వైసీపీ ప్రభుత్వం రైతులకు చేసిన మేలు ఏమీ లేదు. మే ము పండిన పంటలను స్థాని కంగానే గిట్టుబాటు ధరలకు కోనుగోలు చేస్తామన్నారు. అ ది కేవలం మాటలకై పరిమిత మైంది. గోదా ముల నిర్మాణము కూడా ముందుకు సాగడం లేదు. సీఎం జగన రైతులకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు. మాటలతో మభ్యపెడుతున్నారు.
త్వరలో పనులు ప్రారంభిస్తారు - నాగేంద్ర, మార్కెట్ యార్డు కార్యదర్శి
మార్కెట్ యార్డు వారు కేవలం స్థల పరిశీల చేశారు. నిధులు, నిర్మాణపనులు ఏడీసీబ్యాంక్ సొసైటీ వారి ఆధ్యర్యంలో చేపట్టారు. ఆగిపోయిన పనులు త్వరలో ప్రారంభిస్తారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Apr 29 , 2024 | 12:16 AM