Home » Stockholm
మహారాష్ట్రకు చెందిన విద్యావేత్త అశోక్ విఖే పాటిల్ కుమార్తె నీలా విఖే పాటిల్ స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. స్టాక్‌హోమ్ సిటీ నుంచి ఎంపీగా ఎన్నికైన ఆమె.. దేశంతో పాటు నగర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
రైతులు పండించే పంటలు స్థానికంగా నిల్వ ఉంచడానికి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గోదాముల నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. నిధులు కొరతతో గోదాముల నిర్మాణాలు వివిధ దశల్లో నిల్చిపోయాయి. రైతులు పండించిన పంటలు నిల్వ ఉంచడానికి మడకశిర మార్కెట్ యార్డు పరిధిలో స్థలాన్ని సేకరించారు. జమ్మానిపల్లి, మెళవాయి, మడకశిర, కదిరేల్లి, సీ కోడిగేపల్లి, బుళ్లసముద్రం, ఆమిదాలగొంది, గుడిబండ, మందలపల్లి, మోరుబాగులు, అలుకూర్, రొళ్ల, అమరాపురం గ్రామాల్లో 13 గోదాముల నిర్మాణాలకు 2022లో రూ.2.86 కోట్లు కేటాయించారు.