MLA Gummanur Jayaram నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
ABN, Publish Date - Jul 05 , 2024 | 12:19 AM
గుంతకల్లు నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన గ్రామాల వారీగా పార్టీ శ్రేణులతో సమీక్ష జరిపారు.
- ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
పామిడి, జూలై 4: గుంతకల్లు నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన గ్రామాల వారీగా పార్టీ శ్రేణులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు, అత్యవసర అభివృద్ధిపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, డీలర్లు యానిమేటర్ల నియామకంపై స్థానిక నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షురాలు పత్తి హిమబిందు, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి బొల్లు శ్రీనివాసరెడ్డి, గుత్తి మార్కెట్ యార్డు మాజీ చైర్మన ప్రభాకర్ చౌదరి, విభిన్న ప్రతిభా వంతుల జిల్లా అధ్యక్షుడు అప్పన్నగారి కుమార్, నాయకులు ఆర్‌ఆర్ రమేష్, జింకల సంజీవకుమార్, నల్లబోతుల శ్రీనివాసులు, బొమ్మా మోహన కృష్ణ, ముసలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Jul 05 , 2024 | 12:19 AM