collector: ప్రజలకు అందుబాటులో ఉండండి
ABN, Publish Date - May 23 , 2024 | 12:26 AM
మండల రెవెన్యూ అధికారులు నిత్యం రైతులు, ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. మండలంలోని వేల్పుమడుగు, విడపనకల్లు గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ముందుగా వేల్పుమడుగు గ్రామంలోని సుంకులమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం
విడపనకల్లు, మే 22: మండల రెవెన్యూ అధికారులు నిత్యం రైతులు, ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. మండలంలోని వేల్పుమడుగు, విడపనకల్లు గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ముందుగా వేల్పుమడుగు గ్రామంలోని సుంకులమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. గ్రామంలో గురువారం జరిగే సుంకులమ్మ దేవి ముత్యాలపల్లకి ఉత్సవం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రామంలో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా చూడాలని గ్రామ సర్పంచ తిప్పారెడ్డితో పాటు గ్రామ పెద్దలకు సూచించారు. అనంతరం విడపనకల్లు తహసీల్దారు కార్యాలయం చేరుకుని తనిఖీలు చేశారు. సీపీఐ నాయకుడు ఎంబీ చెన్నరాయుడు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. విడపనకల్లు తహసీల్దారు ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రమే వచ్చానని, ఇతర పనులు ఏవి చేయను అంటూ మండల ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదు చేశారు.
రైతులు బ్యాంకుల్లో రుణాలు రెన్యువల్ కోసం తహసీల్దారు కార్యాలయానికి వచ్చి వనబీలు రాక ఇబ్బందులు పడుతున్నా ఎవరు పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని పేర్కొన్నారు. విడపనకల్లు రైతులు వనబీ అడంగల్ కోసం గుంతకల్లు, ఉరవకొండకు వెళ్లి తీసుకొని రావాల్సి వస్తోంది అని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ మండలంపై అధికారులు అందరికి పట్టు ఉండాలన్నారు. కార్యాలయంలో రికార్డులను పక్కాగా నిర్వహించాన్నారు. తహసీల్దారు కార్యాలయం ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని సేవలను ఎప్పటికప్పుడు అందించాలన్నారు. తహసీల్దారు కార్యాలయ ప్రాంగణం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, కార్యాలయంలో సిటీజన చార్టు ఏర్పాటు చేయాలని, ఎలాంటి సేవలు అందిస్తున్నారు అనే వివరాలు ప్రజలకు తెలియ జేయాలని ఆదేశించారు. అనంతరం రికార్డులను పరిశీలించి సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివా్‌సరెడ్డి, తహసీల్దారు దస్తగిరయ్య, ఎంపీడీఓ కొండయ్య, డీటీ బసవకుమార్, రీసర్వే డీటీ వెంకటేశ్వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 23 , 2024 | 12:26 AM