ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

diarrhea విజృంభిస్తున్న డయేరియా

ABN, Publish Date - Jul 05 , 2024 | 12:16 AM

వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధుల్లో ఒకటైన డయేరియా పట్టణంతోపాటు మండలంలో కూడా విజృంభిస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ముప్పుగా తయారవుతోంది. డయేరియా భారిన పడ్డ రోగులు డబ్బులు ఉంటే ప్రైవేట్‌ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.

తాడిపత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులు

-రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు

తాడిపత్రి, జూలై4: వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధుల్లో ఒకటైన డయేరియా పట్టణంతోపాటు మండలంలో కూడా విజృంభిస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ముప్పుగా తయారవుతోంది. డయేరియా భారిన పడ్డ రోగులు డబ్బులు ఉంటే ప్రైవేట్‌ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.


డబ్బులు లేని నిరుపేదలు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. ప్రతిరోజూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొదట 10లోపు ఉన్న ఈ సంఖ్య రానురాను 40కి చేరింది. వీరిలో 20 మందికి పైగా అడ్మిట్‌ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్క మంచంలో ఇద్దరికి చొప్పున వైద్యం అందిస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి సరైన మందులు లేకపోవడంతో బహిరంగ మార్కెట్‌కు వెళ్లి మందులు తెచ్చుకోవాలని వైద్యసిబ్బంది రోగుల బంధువులకు సలహాలు ఇస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డయేరియా విజృంభించడంపై వైద్యసిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా వైద్య సిబ్బంది వాడవాడలా తిరిగి ప్రజలకు డయేరియాపై అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 05 , 2024 | 12:16 AM

Advertising
Advertising