MINISTER KESAV ; రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించండి
ABN, Publish Date - Jul 31 , 2024 | 12:05 AM
విద్యుత శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్ చేయాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు ల కేశవ్‌కు విద్యుత కాంట్రాక్ట్ కార్మికులు విన్నవించారు. వారు మంగళవా రం అనంతపురం నగరంలోని మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఆయన స్వగృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ... తాము విద్యుతశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పదేళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామన్నారు. కావున రెగ్యులర్ ఉద్యోగుల కు ఇచ్చే వేతనాలను తమకు ఇవ్వాలని కోరారు.
ఆర్థిక మంత్రి కేశవ్‌కు విన్నవించిన విద్యుత కాంట్రాక్ట్ కార్మికులు
పామిడి, జూలై 30 : విద్యుత శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్ చేయాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు ల కేశవ్‌కు విద్యుత కాంట్రాక్ట్ కార్మికులు విన్నవించారు. వారు మంగళవా రం అనంతపురం నగరంలోని మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఆయన స్వగృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ... తాము విద్యుతశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పదేళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామన్నారు. కావున రెగ్యులర్ ఉద్యోగుల కు ఇచ్చే వేతనాలను తమకు ఇవ్వాలని కోరారు. అనంతరం వివిధ డి మాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు నారాయణస్వామి, సుదర్శనబాబు, అజయ్‌కుమార్, నాగరాజు, దేవేంద్రనాయక్, ఎర్రిస్వామి, కుమార్‌స్వామి, నారాయణరావు, ఇంద్రకుమార్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jul 31 , 2024 | 12:05 AM