get to gether: పూర్వవిద్యార్థుల అపూర్వ కలయిక
ABN, Publish Date - May 26 , 2024 | 11:37 PM
మండలంలోని కృష్ణాపురం జిల్లా పరిషత ఉన్నతపాఠశాలలో 1988-89 వ విద్యాసంవత్సరంలో పదో తరగతి చదవిని విద్యార్థులు ఆదివారం అదే పాఠశాలలో ఆదివారం కలుసుకున్నారు.
బుక్కపట్నం, మే26: మండలంలోని కృష్ణాపురం జిల్లా పరిషత ఉన్నతపాఠశాలలో 1988-89 వ విద్యాసంవత్సరంలో పదో తరగతి చదవిని విద్యార్థులు ఆదివారం అదే పాఠశాలలో ఆదివారం కలుసుకున్నారు.
సుమారు 35 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నాటి గురువులు చంద్రశేఖర్‌రెడ్డి, మనోరమణ, అంజనరెడ్డి, శివయ్యచౌదరి, శివయ్య, వెంకటశివారెడ్డి, ఆదినారాయణరెడ్డిలను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. తర్వాత ఇటీవల వెలువడిన పది ఫలితాల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులు బాబ్జానకు రూ.2వేలు, చందనకు రూ.1500, బొమ్మినేని పూర్ణశ్రీకు రూ.1000 నగదు బహుమతులను అందజేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - May 26 , 2024 | 11:37 PM