ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మూడుదారులూ మూసివేత

ABN, Publish Date - Apr 20 , 2024 | 12:12 AM

సార్వత్రిక ఎన్నికల నామి నేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ప్రజలు, ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదు.

atp election problems

అనంతపురం క్లాక్‌టవర్‌, ఏప్రిల్‌ 19: సార్వత్రిక ఎన్నికల నామి నేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ప్రజలు, ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. ఆర్డీఓ కార్యాలయం గతంలో టవర్‌క్లాక్‌ వద్ద ఉండేది. శిథిలా వస్థకు చేరిన భవనాన్ని కూల్చి వేయడం, నిర్మాణాల కోసం ఆర్డీఓ కా ర్యాలయాన్ని డ్వామా కార్యాలయం ఆవరణంలోకి మార్చారు. ఈ క్రమంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో నామినేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నామినేషన్ల స్వీకరణతో ఆర్డీఓ కార్యాలయంలోకి వెళ్లే మూడు దారులనూ పోలీ సులు మూసి వేశారు. దీంతో డ్వామా, డీఆర్‌డీఏ, హౌసింగ్‌, అటవీ, విజిలెన్స, పర్యాటక శాఖ, భూమి నాణ్యత శాఖల ఉద్యోగులు అటు వెళ్ల డానికి నానా ఇబ్బందుతులు పడుతున్నారు. ఐడీ కార్డు ఉంటేనే కార్యా లయాలలోకి అనుమతిస్తున్నారు. ఒకవేళ ఉద్యోగులు ఐడీ కార్డు ఇం ట్లోనే మరిచిపోతే ఇక అంతే సంగతులే. ససేమిరా పోలీసులు కార్యాలయాల్లోకి ఉద్యోగులను అనుమతించడం లేదు. ఇందుకు వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటు తీసుకురావాలని ఆయా కార్యాలయాల ఉద్యోగులు, పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:12 AM

Advertising
Advertising