puchhalapalli sundaraiah: పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళి
ABN, Publish Date - May 20 , 2024 | 12:28 AM
స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమకారుడు పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని పట్టణంలోని సాయికృప జూ నియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు.
- వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో వర్ధంతి
ధర్మవరం, మే19: స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమకారుడు పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని పట్టణంలోని సాయికృప జూ నియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సీపీఎం, సీపీఐ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. పుచ్చలపల్లి సుందరయ్య క మ్యూనిస్టు పార్టీ స్థాపించినప్పటి నుంచి పేదల కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టారన్నారు. దేశ తొలిప్రధాని జవహార్‌లాల్ నెహ్రూకు ప్రతిపక్షనేతగా ఉండి ప్ర జల సమస్యల పరిష్కరించడానికి ఎంతో కృషిచేశారన్నారు. సంప న్న కుటుంబంలో, అగ్రకులంలో జన్మించిన ఆయన బడుగుబలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమించారన్నారు. పేదల కోసం తన భూములను కూడా పంచిపెట్టారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకుడు ఎస్‌హెచబాషా, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగుమధు, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి నాగార్జున, సీపీఐ పట్టణకార్యదర్శి రమణ, అంగనవాడీ వర్కర్స్ యూనియన అధ్యక్ష, కార్యదర్శులు సరస్వతి, చంద్రకళ, నాయకులు, మున్సిపాలిటీ, పారిశుధ్య కార్మిక సంఘంనాయకులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 20 , 2024 | 12:28 AM