ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ : ఆర్వో

ABN, Publish Date - Apr 18 , 2024 | 12:56 AM

అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్వో చిరంజీవి తెలిపారు.

ఎమ్మిగనూరు రూరల్‌, ఏప్రిల్‌17: అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్వో చిరంజీవి తెలిపారు. బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలోని ఆర్వో చాంబర్‌లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లను తీసుకోవడం జరుగుతుందన్నారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకుంటామన్నారు. సెలవు దినాల్లో నామినేషన్లు తీసుకోవడం జరగదన్నారు. నామినేషన్‌ వేసేందుకు వచ్చే అభ్యర్థి వెంట ఐదు మంది వరకునామినేషన్‌ కేంద్రంలోకి రావాల్సి ఉంటుందన్నారు. జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలకు ఒక ప్రపోజ ల్‌ ఉంటే చాలని, మిగిలిన పార్టీలకు పదిమంది ప్రపోజల్‌ ఉండాలన్నారు. రూ.10వేల రుపాయల డిపాజిట్‌ను కట్టాల్సి ఉంటుంద, నామినేషన్‌తో పాటు అఫిడవిట్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రెండు ఫొటోలు తీసుకురావాల్సి ఉంటుందన్నారు. గరిష్టంగా నాలుగు నామినేషన్లు వయవచ్చని తెలిపారు. అలాగే అందరు 100మీటర్ల దూరాన్ని పాటించాల్సి ఉంటుందన్నారు. నియోజకవర్గంలో మూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్‌ దాఖలు చేసిన వారు విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే 29వ తేదీ మధ్యాహ్నం 3గంటలలోపు విత్‌డ్రా చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 134 పోలింగ్‌ కేంద్రాలకు వెబ్‌క్యాస్టింగ్‌కు అనుమతి కోరాము, అనుమతి వస్తే ఏర్పాటు చేస్తాం. ఈ సమావేశంలో తహసీల్దార్‌ శేషారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:56 AM

Advertising
Advertising