అక్రమాల అధికారి డిప్యుటేషన్ రద్దు
ABN, Publish Date - Jul 31 , 2024 | 02:17 AM
పరిశ్రమల శాఖలో అక్రమాల అధికారిగా పేరున్న పి.ప్రతా్‌పరెడ్డి డిపు్యుటేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
తెలంగాణలోని మాతృశాఖకు ప్రతా్‌పరెడ్డి
పరిశ్రమల డైరెక్టర్‌కు ఏపీటీపీసీ ఎండీ బాధ్యతలు
అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): పరిశ్రమల శాఖలో అక్రమాల అధికారిగా పేరున్న పి.ప్రతా్‌పరెడ్డి డిపు్యుటేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆయనను తెలంగాణలోని మాతృశాఖ (పరిశ్రమలు)కు తిరిగి పంపేసింది. ప్రస్తుతం ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా ప్రతా్‌పరెడ్డి నిర్వహిస్తున్న బాధ్యతలను పరిశ్రమల శాఖ డైరెక్టర్ సి.శ్రీధర్‌కు అప్పగించింది. ‘అక్రమాల అధికారికి మళ్లీ అందలం’ శీర్షికన ఈ నెల 27న ‘ఆంధ్రజ్యోతి’లో వెలువడిన కథనంపై ప్రభుత్వం స్పందించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన డిప్యుటేషన్ ఉత్తర్వులను సమీక్షించిన అనంతరం ప్రతా్‌పరెడ్డి డిప్యుటేషన్‌ను రద్దు చేస్తూ మంగళవారం తాజా ఉత్తర్వులు విడుదల చేసింది. బుధవారం నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాగా, పరిశ్రమల శాఖలో ప్రతా్‌పరెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై సీఐడీ విచారణ జరిపించాలని దళిత ఇండస్ట్రియల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అసోసియేషన్ ప్రెసిడెంట్ మామిడి సుదర్శన్ లేఖ రాశారు. ఏపీఐఐసీలో ఈడీగా, ఏపీటీపీసీ ఎండీగా, రామాయపట్నం పోర్టు డెవల్‌పమెంట్ కార్పొరేషన్ సీఈవోగా పనిచేసిన కాలంలో ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో లంచం తీసుకుని పదుల సంఖ్యలో కన్సల్టెంట్లను నియమించుకున్నారని, వారికి నెలకు రూ.2లక్షల చొప్పున జీతాలు చెల్లించి ప్రజాధనాన్ని దోచిపెట్టారని పేర్కొన్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీటీపీసీ వాహనాల్లోనే ఆయన వైసీపీ అభ్యర్థులకు డబ్బులు చేరవేశారని తెలిపారు. ప్రతా్‌పరెడ్డి వ్యవహారంపై కొందరు టీడీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగా ప్రతా్‌పరెడ్డి అవినీతి, అక్రమాలపై పూర్తి సమాచారం అందకపోవడంతో ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన కొత్త ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించి ఇటీవలే మచిలీపట్నం పోర్టు డెవల్‌పమెంట్ కార్పొరేషన్ సీఈవోగా నియమించి అందలమెక్కించిందని వివరించారు. ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించిన ప్రభుత్వం.. ప్రతా్‌పరెడ్డి అవినీతి, అక్రమాలపై సీఐడీ విచారణ జరిపించాలని సుదర్శన్ డిమాండ్ చేశారు.
Updated Date - Jul 31 , 2024 | 07:46 AM