ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దళిత జడ్పీ చైర్‌పర్సన్‌కు ఘోర అవమానం

ABN, Publish Date - Apr 24 , 2024 | 03:05 AM

కదిలితే నా దళితులు.. నా క్రిస్టియన్‌లు అం టూ ఊదరగొట్టే జగన్‌ పాలనలో దళితురాలైన గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టీనాకు ఘోర అవమానం ఎదురైంది.

పార్టీ మారటంతో కన్నెర్ర చేసిన వైసీపీ అధిష్ఠానం

సమావేశానికి ముఖం చాటేసిన ఆ పార్టీ జడ్పీటీసీలు

కోరం లేకపోవడంతో వాయిదా వేసిన వైనం

గుంటూరు సిటీ, ఏప్రిల్‌ 23: కదిలితే నా దళితులు.. నా క్రిస్టియన్‌లు అం టూ ఊదరగొట్టే జగన్‌ పాలనలో దళితురాలైన గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టీనాకు ఘోర అవమానం ఎదురైంది. కొద్ది రోజుల క్రితం క్రిస్టీనా, ఆమె భర్త సురేష్‌ టీడీపీలో చేరారు. కీలక సమయంలో పార్టీ మారారన్న అక్కసుతో వైసీపీ అధిష్ఠానం ఆమెపై కన్నెర్ర చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్‌ సాధారణ సమావేశాన్ని అధికార పార్టీ జడ్పీటీసీలు బహిష్కరించారు. గుంటూరు జిల్లా పరిషత్‌లో ఆ పార్టీకి మొత్తం 53 మంది జడ్పీటీసీలు ఉండగా, కేవలం ఆరుగురు మాత్రమే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో జడ్పీ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టీనా సమావేశాన్ని వాయిదా వేశారు. సమావేశం ఆరంభానికి ముందు జిల్లా పరిషత్‌కు వచ్చిన జడ్పీటీసీలు భోజనాలు బాగో లేవంటూ చైౖర్‌పర్సన్‌ చాంబర్‌ వద్దకు వచ్చి గొడవ చేశారు.

Updated Date - Apr 24 , 2024 | 07:17 AM

Advertising
Advertising